పశ్చిమ్ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) మంగళవారం విడుదల చేసింది. మొత్తం 294 స్థానాలకు గాను.. టీఎంసీ 291 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. డార్జిలింగ్ ప్రాంతంలోని 3 సీట్లలో అనిత్ థాపా నాయకత్వంలోని బీజీపీఎం పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక, ఈ స్థానం నుంచి బీజేపీ సువేందు అధికారి పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్‌లో 2011 నుంచి వరుసుగా మమత విజయం సాధిస్తూ వస్తున్నారు.ఇక, గత ఎన్నికల్లో దీదీ పోటీచేసిన నందిగ్రామ్‌లో ఈసారి టీఎంసీ నుంచి పవిత్ర కర్‌ పోటీచేస్తున్నారు. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన పవిత్ర కర్‌.. జాబితా విడుదలకు కొన్ని నిమిషాల ముందే తిరిగి సొంతగూటికి చేరడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉన్న సువేందు.. నందిగ్రామ్‌లో ఆమెను ఓడించిన విషయం తెలిసిందే. పార్టీ అధికారంలోకి వచ్చినా.. సీఎం ఓటమిని ఎదుర్కొన్నారు. దీంతో భవానీపూర్‌ నుంచి విజయం సాధించిన శోభన్‌దేవ్ ఛటర్జీ అధినేత్రి కోసం త్యాగం చేశారు. ఆయన రాజీనామా చేయడంతో భవానీపూర్ ఉప-ఎన్నికల్లో పోటీచేసి 59 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో 221 స్థానాలతో వరుసగా మూడోసారి టీఎంసీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. కిందటిసారి నిర్వహించడంతో ఈసీ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రకటించిన అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కిందటసారి కంటే అధిక స్థానాల్లో గెలుస్తామని, 226 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. భవానీపూర్‌లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోల్‌కతా సీపీ సహా పలువురు అధికారులపై ఈసీ తప్పించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ఘర్షణలు సృష్టించడానికే బీజేపీ ఈ కుట్రకు తెరతీసిందని సీఎం ఆరోపించారు. ఆ పార్టీ తరఫున ఈసీ మంచి ఆట ఆడుతోందని.. బీజేపీ కోసం ఎన్నికల అధికారులే ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అనుకోని ఘటనలు జరిగితే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని మమతా హెచ్చరించారు.