సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. తనిష్క్ సహా జువెలరీల్లో గోల్డ్ రేట్లు ఇవే

Wait 5 sec.

22K Gold Price: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది. ముడి చమురు ధరలు ఆకాశమేహద్దుగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి ఎగబాకింది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ అమెరికా డాలర్ పుంజుకోవడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై నీలినీడలు కమ్ముకోవడంతో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ ఆల్ టైమ్ హై స్థాయి నుంచి తులం బంగారం రేటు రూ.20 వేల మేర దిగివచ్చింది. ఈ క్రమంలో పసిడి ధరలు మరింత పతనమవుతాయని విశ్లేషకులు అంచనా వేశారు. రానున్న రోజుల్లో బంగారం రేట్లు పడిపోతాయన్న వార్తా కథనాలూ వెలువడ్డాయి. అయితే, ఊహించని విధంగా ఈరోజు దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. వరుసగా ఆరు రోజుల పతనానికి బ్రేకులు పడినట్లయింది. ఈ క్రమంలో తనిష్క్, మలబార్, లలితా వంటి ప్రముఖ జువెలరీల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 660 మేర పెరిగింది. దీంతో తులం ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,58,080 వద్దకు ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల తయారీ కోసం ఉపయోగించే 916 ప్యూరిటీ గల బంగారం ధర 10 గ్రాములపై రూ.600 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 1,44,900 వద్దకు చేరుకుంది. తనిష్క్ జువెలరీల్లో బంగారం ధరతనిష్క్ జువెలరీల్లో ఈరోజు 22 క్యారెట్ల 916 బంగారం ధర 1 గ్రాముకు రూ. 110 మేర పెరిగింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ. 14,580 వద్ద ట్రేడవుతోంది. ఇక తులం బంగారం లెక్క చూసుకుంటే రూ.1100 మేర పెరిగి రూ.1,45,800 పలుకుతోంది. జొయాలుక్కాస్‌లో బంగారం ధరజొయాలుక్కాస్‌ జువెలరీల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి రేటు 1 గ్రాముకు రూ. 60 మేర పెరిగి రూ.14,490 వద్ద ట్రేడవుతోంది. ఇక తులం (10 గ్రాములు) రేటు చూసుకుటం రూ.600 మేర పెరిగి రూ.1,44,900 పలుకుతోంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో రూ. 60 పెరిగి రూ.14,490 వద్ద ఉంది. ఇక 10 గ్రాముల లెక్క చూస్తే రూ.600 మేర పెరిగి రూ.,1,44,900 వద్ద ట్రేడవుతోంది. లలితా జువెలర్స్‌లోదక్షిణ భారత్‌లోని ప్రముఖ జువెలరీల్లో ఒకటైన లలితా జువెలరీల్లో ఈరోజు 1 గ్రాముకు రూ.60 పెరగడంతో రూ.14,490 వద్ద అమ్ముడవుతోంది. అదే తులం రేటు లెక్క తీసుకుంటే రూ.600 పెరిగి రూ.1,44,900 వద్ద ఉంది.