తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రత్యూష కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన అప్పీలును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి విధించిన రెండేళ్ల జైలు శిక్షను సర్వోన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. సిద్ధార్థ రెడ్డి ఇప్పటికే జైలు జీవితం గడిపిన నేపథ్యంలో.. మిగిలినకాలం జైలు శిక్షను అనుభవించేందుకు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలంటూ సిద్ధార్థ రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డి సోమవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. అనంతరం పోలీసులు సిద్ధార్థ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.