ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోకొలువుదీరింది. అమరావతిలోని శాఖమూరులో ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అతిథులను మాట్లాడేందుకు ఆహ్వానించే క్రమంలో మంత్రి నారా లోకేష్‌కు యాంకర్ సుమ ఇచ్చిన ఎలివేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాట్లాడటానికి నారా లోకేష్‌ను ఆహ్వానిస్తూ.. ఆయన గురించి సుమ చెప్పిన ఇంట్రడక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. "ప్రజల ఆశయాలకు, అభిప్రాయాలకు పెద్దపీట వేసే నాయకుడు.. తన, మన అనే భేదం లేకుండా కష్టం అనే ప్రతి ఒక్కరికీ అండగా నిలబడే వ్యక్తి.. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కలగలిపిన మన లీడర్.. .. " అంటూ యాంకర్ సుమ నారా లోకేష్‌కు ఇచ్చిన ఎలివేషన్ స్పీచ్.. సభికులకు కేకలు పెట్టించింది. దీంతో సభా ప్రాంగణం అరుపులు, కేకలతో నిండిపోయింది. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దపెట్టున విజిల్స్ వేస్తూ సందడి చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. పొట్టి శ్రీరాములు నిత్య పోరాటయోధుడని.. ఆంధ్ర రాష్ట్రం రూపంలో ఆయన జీవించే ఉన్నారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు స్వార్థం లేని పోరాటం చేసిన గొప్పి వ్యక్తి అని.. దీక్షకు స్థలం ఇవ్వకపోతే రోడ్డుపైనే దీక్ష చేస్తానని ప్రకటించిన ధైర్యశాలి అని అన్నారు. అమరావతిలోని విగ్రహం తెలుగువాళ్లను ప్రపంచస్థాయికి తీసుకెళ్తుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు వలనే తెలుగువాళ్లమని గర్వంగా చెప్పుకొంటున్నామని అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే తాను యువగళం పాదయాత్ర చేపట్టినట్లు నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతామని ఆర్యవైశ్యులకు హామీ ఇచ్చానని.. ఇచ్చిన మాట ప్రకారం విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పొట్టి శ్రీరాములు పేరిట నాణెం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. అలాగే అమరావతిలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఏపీ ఆత్మగౌరవం స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ అనే పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నారా లోకేష్ కోరారు.