కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై.. ఈనెల 25న బీఆర్ఎస్‌లో చేరిక, ఇంటి వద్ద ఫ్లెక్సీలు చించేసిన అనుచరులు

Wait 5 sec.

గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి, హస్తం పార్టీ సీనియర్ నేత టీ .. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని.. ఆయన బహిరంగంగా మీడియా ముందే వెల్లడించడం గమనార్హం. కుమార్.. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరగా.. అప్పటి నుంచి జగిత్యాలలో వర్గపోరు మొదలైంది. అది కాస్తా ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తారస్థాయికి చేరుకుంది. తమ వర్గం వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.. తమ అనుచరులను ఇండిపెండెంట్లుగా పోటీ చేయించి.. గెలిపించుకుని తన సత్తా ఏంటో హైకమాండ్‌కు తెలియజేశారు. అయినప్పటికీ తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు తన అనుచరులతో జీవన్‌రెడ్డి చెప్పినట్లు సమచారం. ఈ నెల 25వ తేదీన బీఆర్‌ఎస్‌ పార్టీలో జీవన్ రెడ్డి చేరనున్నట్లు తెలుస్తోంది. గత 4 దశాబ్దాలుగా జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిన జీవన్‌రెడ్డి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా గెలిచారు. అయితే డాక్టర్ సంజయ్ కుమార్ రాకతో కాంగ్రెస్‌ పార్టీలో తనకు ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈనెల 25వ తేదీన జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను.. ఆయన అనుచరులు చించేయడం, తొలగించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివాసం ముందు, లోపల ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండాలు, అగ్రనాయకుల ఫోటోలతో కూడిన బ్యానర్లను కార్యకర్తలు తీసేశారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే ఉన్న ఫోటోలు, ఫ్లెక్సీలను ఉంచుతున్నారు. తాను పార్టీకి ఎంత చేస్తున్నా దాన్ని అధిష్టానం గుర్తించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి.. ఇక కాంగ్రెస్‌ పార్టీతో బంధం తెంచుకోవడమే మేలు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన తర్వాతే.. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.