విశాఖకు మరో భారీ పెట్టుబడి.. రూ.2,387.81 కోట్లతో ‘సెమీకండక్టర్‌’ తయారీ పరిశ్రమ

Wait 5 sec.

విశాఖపట్నానికి ఐటీ కంపెనీలతో పాటుగా పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో భారీ పరిశ్రమ పెట్టుబడులు పెట్టింది.. విశాఖపట్నంలోని ఆనందపురం మండలం తర్లువాడ దగ్గర ఏఎస్‌ఐపీ (అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) సంస్థ సెమీకండక్టర్‌ అసెంబ్లింగ్, టెస్టింగ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమను రూ.2,387.81 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ సంస్థ మొదటి దశలో రూ.547.09 కోట్ల పెట్టుబడులతో.. మొదటి దశ ప్రాజెక్టు పనులు 2027 జులై నాటికి పూర్తి చేయాలని భావిస్తు్న్నారు.ఏపీ ప్రభుత్వం ఏఎస్‌ఐపీ పరిశ్రమకు 30 ఎకరాలను కేటాయించింది.. ఈ సంస్థ ఏర్పాటుతో 1,000 మందికి (రెండు దశల్లో కలిపి) ఉపాధి కల్పించనున్నట్లు ప్రతిపాదనల్లో ప్రస్తావించారు. ఏఎస్‌ఐపీ పరిశ్రమ 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి మొదటి దశలో 96 మిలియన్‌ యూనిట్‌ల చిప్‌లను సంస్థ ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే క్వాడ్‌ ఫ్లాట్‌ నో-లీడ్‌ ప్యాకేజీ 78 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు ఫ్లిప్‌ చిప్‌ బాల్‌ గ్రిడ్‌ అర్రే ప్యాకేజీ 18 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ పరిశ్రమ రెండో దశ విస్తరణలో ఫ్లిప్‌చిప్‌ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఏఎస్‌ఐపీ పరిశ్రమ డేటా సెంటర్‌/ఏఐ అప్లికేషన్‌కు అవసరమైన 2.5/3డి ప్యాకేజింగ్‌ టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది.ఏఎస్‌ఐపీ పరిశ్రమ దాదాపు రూ.1,840 కోట్లతో రెండో దశలో ప్రాజెక్టును విస్తరించనుంది. ఈ ప్రాజెక్టు రెండు దశలకు అవసరమైన భూములి, ఇతర సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్‌ను కూడా సిద్ధం చేశారు.. త్వరలోనే డీపీఆర్‌ను అందించనున్నారు. రాష్ట్రంలో చిప్‌లు తయారు చేసే మరో నాలుగు కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నారట. దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ కంపెనీ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో విశాఖలో ఏర్పాటు కాబోతున్న ఏఎస్‌ఐపీ మొదటి సెమీకండక్టర్‌ ఓఎస్‌ఏటీ, ఏటీఎంపీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొరియా సంస్థ ఏపీఏసీటీ కంపెనీ లిమిటెడ్‌ ప్రపంచంలో ప్రముఖ సంస్థలకు ఉత్పత్తులను అందిస్తోందట. మొత్తం మీద విశాఖపట్నానికి మరో భారీ పరిశ్రమ రాబోతోంది.