ఏప్రిల్ 1 నుంచి టాటా కార్ల ధరలు పెంపు.. ఒక్కో కారుపై పెరిగేది ఎంతంటే?

Wait 5 sec.

Tata Motors Car Price: దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ, టాటా గ్రూప్‌లోని మోజర్ ఆటో సెక్టార్ సంస్థ లిమిటెడ్ () తమ వినియోగదారులకు ఝలక్ ఇచ్చింది. తమ కంపెనీకి చెందిన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. , అందులో భాగంగానే ధరల సవరణ చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే పలు కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు వాటి దారిలోనే టాటా మోటార్స్ పీవీ సైతం ధరల పెంపు ప్రకటన చేసింది. సవరించిన ధరలను ఏప్రిల్ 1, 2026 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో (ICE) నడితే తమ కార్లపై 0.5 శాతం వరకు ఈ ధరల పెంపు ఉంటుందని టాటా మోటార్స్ పీవీ తాజా ప్రకటన ద్వారా వెల్లడించింది. కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయని పేర్కొంది. మరోవైపు.. ఇప్పటికే టాటా మోటార్స్ కమెర్షియల్ మోటార్స్ లిమిటెడ్ కంపెనీ సైతం తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన వాహన రకాన్ని బట్టి ధరలను 1.5 శాతం వరకు పెంపు ఉంటుందని వెల్లడించింది. ఈ ధరల పెంపు సైతం వచ్చే నెల ఒకటో తేదీ నుంచే అమలులోకి రానున్నాయి. ఈ కంపెనీలు సైతం ధరల పెంపుప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ, తమ కంపెనీకి చెందిన కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ధరలను 2 శాతం మేర పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటన చేసింది. ఆడి కార్ల ధరల పెంపు సైతం ఏప్రిల్ 1 నుంచి అమలు అవుతాయని తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోనే ధరలు పెంచాల్సి వస్తోందని వెల్లడించింది. మరోవైపు.. మారుతీ సుజుకీ సైతం తమ వాహనాల ధరల పెంపు సంకేతాలు ఇచ్చింది. మెటల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ధరల పెంపుపై సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని కంపెనీ వెల్లడించింది. వీటితో పాటు హ్యూందాయ్ మోటార్స్ ఇండియా, హోండా ఇండియా సహా ఇతర కంపెనీలు సైతం ధరల పెంపునకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతానికి ఆయా కంపెనీల నుంచి ప్రకటనలు రాలేదు.