వంట గ్యాస్ సిలిండర్ల డెలివరీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పౌరసరఫరాల శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. ఎల్పీజీ గ్యాస్ కొరతపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో రోజూ సమీక్షలు జరుపుతున్నామని వివరించారు. ఖతార్‌లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ సరఫరాలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాలలో పీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 60 వేల మందికి పీఎన్‌జీ గ్యాస్ అందించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రాధాన్య క్రమంలో వసతి గృహాలు, ఆస్పత్రులు, అన్న క్యాంటీన్లు, కొన్ని హోటళ్లకు గ్యాస్ సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే పౌరసరఫరాల శాఖ అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. గృహ వినియోగదారులకు ఓటీపీ విధానంలోనే గ్యాస్ సిలిండర్ల డెలివరీ జరుగుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్యా్స్ ఏజెన్సీల వద్ద గుమికూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లుమరోవైపు ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ రాష్ట్రవ్యా్ప్తంగా 54 వేల ఇండక్షన్ స్టవ్స్ అందించినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలు లేనిపోని భయాలు పెట్టుకోవద్దని.. అపోహలతో వంట గ్యాస్ కోసం బుకింగ్స్ వద్దని సూచించారు. పానిక్ బుకింగ్స్ కారణంగా సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని వివరించారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షఏపీలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో సమస్యలు రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పీఎన్‌జీ, ఇండక్షన్ స్టవ్స్ వంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎరువులకు లోటు రాకుండా చూడాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు.