భారీగా తగ్గి బంగారం ధరల యూటర్న్.. 2 రోజుల తర్వాత ఇలా.. తనిష్క్, మలబార్ సహా జువెలరీల్లో రేట్లు ఇవే

Wait 5 sec.

22K Gold Price: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, డాలర్ విలువ పుంజుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గత రెండు రోజులుగా భారీగా పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ వంటి కేంద్ర బ్యాంకులు సైతం వడ్డీ రేట్లపై కఠిన వైఖరి అవలంభిస్తున్నాయి. దీంతో పసిడి, వెండి ధరలు తగ్గినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే, ఈరోజు సడెన్‌గా బంగారం ధరలు పెరిగాయి. ఇరాన్ యుద్ధం తీవ్రమవడం, గల్ఫ్ ప్రాంతాల్లోని ఇంధన అలాగే కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పసిడి ధరలను స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లపై ఈ ప్రభావం కనిపించింది. ఈ క్రమంలో ప్రముఖ భారత్‌లోని జువెలరీల్లో ఎంత మేర పెరిగింది, ఇప్పుడు ఎంత ఉంది? అనే వివరాలు తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈరోజు తులంపై రూ.650 మేర పెరిగింది. దీంతో 10 గ్రాములకు రూ.1,50,930 వద్దకు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.600 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,38,350 వద్దకు చేరింది.తనిష్క్ జువెలరీల్లో..తనిష్క్ జువెలరీల్లో మార్చి 20వ తేదీన 22 క్యారెట్ల బంగారం రేటు 1 గ్రాముకు రూ. 120 మేర పెరిగింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ.13,695 వద్దకు చేరింది. ఇక తులం బంగారం (10 గ్రాములకు) చూసుకుంటే రూ.1,36,950 వద్ద ట్రేడవుతోంది. జొయాలుక్కాస్‌లో ఒక గ్రాముకు రూ. 60 మేర పెరిగి రూ.13,655 వద్ద ట్రేడవుతోంది. ఇక తులం బంగారం చూసుకుంటే రూ.600 పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,36,550 వద్ద అమ్ముడవుతోంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లోమలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీల్లో ఈరోజు ఆభరణాల బంగారం రేటు 1 గ్రాముకు రూ. 60 మేర పెరిగి రూ.13,655 వద్దకు చేరగా, తులం బంగారం రేటు రూ.1,36,550 పలుకుతోంది. లలితా జువెలరీల్లోదక్షిణ భారత్‌లోని ప్రముఖ జువెలరీల్లో ఒకటైన లలితా జువెలరీల్లో ఈరోజు ఆభరణాల బంగారం ధర గ్రాముకు రూ. 60 పెరిగింది. దీంతో గ్రాము రేటు రూ.13,655 పలుకుతోంది. ఇక తులం రేటు (10 గ్రాములకు) చూసుకుంటే రూ.1,36,550 వద్దకు చేరుకుంది.