రూ. 9.75 లక్షల కోట్ల లోన్లు రద్దు.. 11 ఏళ్లలో బ్యాంకుల కీలక నిర్ణయం.. టాప్- 10 ఎగవేతదార్లు వీరే..

Wait 5 sec.

: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో మొండి బకాయిలు పేరుకుపోతుంటాయన్న సంగతి తెలిసిందే. వీటినే నాన్ పెర్ఫామింగ్ అసెట్స్ (NPA) అంటారు. ఇక్కడ తాము ఇచ్చిన లోన్లను తిరిగి వసూలు చేయడం కష్టమని భావించే వాటిని బ్యాంకులు తాత్కాలికంగా రద్దు చేస్తుంటాయి. . ఇక్కడ రైటాఫ్ చేసినంత మాత్రాన సదరు లోన్లు రద్దయినట్లు కాదు. ఇది రుణ మాఫీ ఏ మాత్రం కాదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. కానీ బ్యాలెన్స్ షీట్ నుంచి మాత్రం ఆ లోన్ మొత్తాన్ని తొలగిస్తాయి. నిరర్ధక ఆస్తుల్ని తగ్గించుకునేందుకు.. లాభదాయకతను సరిగా చూయించేందుకు బ్యాంకులు చేసే సాంకేతిక ప్రక్రియనే రైటాఫ్. ఇక ఇప్పుడు గత 11 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ. 9.75 లక్షల కోట్ల విలువైన రుణాల్ని రైటాఫ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ లోక్‌సభలో తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ అత్యధికంగా రూ. 1.59 లక్షల కోట్ల రుణాల్ని రైటాఫ్ చేసినట్లు వెల్లడించారు పంకజ్ చౌధరీ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చూస్తే రూ. 47,568 కోట్లకు పరిమితం అయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 31,723 కోట్లు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 40,416 కోట్లు రైటాఫ్ చేయగా.. 2016-17లో రూ. 68 వేల కోట్లకుపైగా, 2017-18 లో రూ. 99 వేల కోట్ల మేర రుణాల్ని బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు 2025 మార్చి 31 నాటికి టాప్- 10 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంకులకు మొత్తం మీద రూ. 40,635 కోట్ల బకాయిలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు వెల్లడించారు. దీంట్లో ఏబీజీ షిప్‌యార్డ్ రూ. 6,695 కోట్ల బకాయితో మొదటి స్థానంలో ఉండగా.. గీతాంజలి జెమ్స్ (రూ. 6,236 కోట్లు) రెండో స్థానంలో ఉంది. బీటా నాప్తాల్ రూ. 5,268 కోట్లతో మూడో స్థానంలో ఉండగా.. రాకేశ్ కుమార్ కుల్దీప్ సింగ్ వాధ్వాన్ రూ. 4,291 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. తర్వాత వరుసగా భూషణ్ స్టీల్ పవర్ అండ్ స్టీల్ డైరెక్టర్లు (రూ. 3,810 కోట్లు), రాజా టెక్స్‌టైల్స్ (రూ. 3,260 కోట్లు), గిల్ట్ ప్యాక్ (రూ. 3080 కోట్లు), ర్యాంక్ ఇండస్ట్రీస్ రూ. 2,655 కోట్లు ఎగవేయగా.. చివరిగా హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రా రూ. 2540 కోట్లతో ఉన్నారు.