SBI MF IPO: స్టాక్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగుతూనే ఉంది. కొన్ని కంపెనీలు వెనకడుకు వేస్తున్నా పలు సంస్థలు ధైర్యంగా ముందుకు వస్తున్నాయి. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. , మణిపాల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ నెలాఖరుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసేందుకు ఈ రెండు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ఎస్‌బీఐ ఫండ్స్ రూ. 13000 కోట్లుదాదాపు రూ. 13 లక్షల కోట్ల వరకు ఆస్తులతో దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజర్‌గా ఎస్‌బీఐ ఫండ్స్ ఉంది. ఈ కంపెనీ పూర్తి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. రూ. 13 వేల కోట్ల నిధులు సమీకరించే లక్ష్యంగా ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఎస్‌బీఐకి 61.76 శాతం వాటా ఉండగా ఐరోపాకు చెందిన సంస్థ అముండికి 36.26 శాతం వాటా ఉంది. ఈ ఐపీఓలో భాగంగా ఎస్‌బీఐ బ్యాంక్ 12.83 కోట్ల షేర్లను విక్రయిస్తుండగా అముండి కంపెనీ తన వాటా నుంచి 7.53 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. అంటే 10 శాతం వాటాకు సమానమైన 20.37 కోట్ల షేర్లను ఈ రెండు సంస్థలు కలిసి విక్రయిస్తున్నాయి. మణిపాల్ హాస్పిటల్స్ రూ. 11000 కోట్లు పబ్లిక్ ఇష్యూ రూ. 9000 కోట్ల నుంచి రూ. 11 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ పబ్లిక్ ఇష్యూలో భాగంగా తాజా షేర్లతో పాటుగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా షేర్లు విక్రయించనుంది. ఓఎఫ్ఎస్ ద్వారా ప్రస్తుత ప్రమోటర్లు కొంత వాటా విక్రయిస్తున్నారు. అయితే, ఎంత మేర వాటా విక్రయం ఉంటుందని ఇంకా వెల్లడించలేదు. ఈ నెలాఖరులోపు (మార్చి 31లోపు) ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద దాఖలు చేయనుందని సమాచారం. ఆ తర్వాత ఈ ఐపీఓ గురించి పూర్తి సమాచారం వెలుగులోకి రానుంది. ఏప్రిల్ నెలలోనే మార్కెట్లోకి లిస్టింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుత మార్కెట్ల అనిశ్చితులతో వాయిదా కూడా వేయవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.