హైదరాబాద్ మహా నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రణాళికను సిద్ధం చేసింది. నగర అభివృద్ధిని కేవలం కోర్ ఏరియాకే పరిమితం చేయకుండా, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) అనే రెండు విభాగాల ద్వారా విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఎటువంటి ఆటంకాలు లేని రవాణా వ్యవస్థను నిర్మించేందుకు ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు, మిస్సింగ్ లింక్ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. , వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మూడు భారీ ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వం ప్రతిపాదించింది.పారడైజ్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్డు వరకు రూ.1,478 కోట్లతో 5.40 కి.మీ మేర కారిడార్ నిర్మించనున్నారు. ఇందులో 500 మీటర్ల అండర్ గ్రౌండ్ రోడ్డు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కారిడార్-2లో భాగంగా పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు రూ.4,263 కోట్లతో 18.18 కి.మీ మేర నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాస్టింగ్ యార్డ్ పనులు ప్రారంభమయ్యాయి. కారిడార్-3లో భాగంగా బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు రూ.1,656 కోట్లతో 9 కిలోమీటర్ల కారిడార్‌ను నిర్మించి పశ్చిమ హైదరాబాద్‌కు రవాణా సులభతరం చేయనున్నారు.హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు కీలకమైన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను ప్రభుత్వం చేపట్టింది. మొదటి రేడియల్ రోడ్డులో భాగంగా ఓఆర్ఆర్ రావిర్యాల నుంచి ట్రిపుల్ ఆర్ ఆమన్‌గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. రెండో రేడియల్ రోడ్డు ద్వారా ఓఆర్ఆర్ బుద్వేల్ నుంచి నాచారం జాతీయ రహదారి 167ను అనుసంధానిస్తారు. ఈ రోడ్డు లగచర్ల, సీతారాంపూర్, చందన్ వెళ్లి వంటి పారిశ్రామిక వాడలను కలుపుతూ ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. దాంతో పాటుగా.. అధిగమించేందుకు హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే మొదటి, రెండో దశల్లో సుమారు 47 కిలోమీటర్ల మేర పనులు పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం మూడో దశలో భాగంగా రూ.1,500 కోట్ల భారీ వ్యయంతో 119.7 కిలోమీటర్ల మేర 49 కొత్త మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ లింక్ రోడ్ల వల్ల ప్రధాన రహదారులపై ఒత్తిడి తగ్గి, అత్యవసర సమయాల్లో ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది.