ఏప్రిల్ 1 నుంచి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా? టాక్స్ లెక్కలపై కొత్త రూల్స్ ఇవే!

Wait 5 sec.

New Rules: కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతోంది. ఈరోజు నుంచి ఉద్యోగుల జీతభత్యాల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మీ టేక్ హోమ్ శాలరీ అంటే ప్రతి నెలా మీ చేతికి అందే నగదులో మార్పులు రావడమే కాకుండా ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో కూడా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త ఆదాయపు పన్ను 2025, కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమావళి 2026, అయితే, మరి మీ జీతంపై ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి డిఫాల్ట్ కొత్త పన్ను విధానంలో మార్పులు, పన్ను స్లాబుల పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. ఉద్యోగులకు లభించే ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) పరిమితి పెంపు, కంపెనీలు ఇచ్చే అలవెన్సులు, బేసిక్ పే నిష్పత్తిలో మార్పుల రానున్నాయి. బేసిక్ పే 50 శాతంగా ఉండాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం జరిగే కంట్రిబ్యూషన్లలో మార్పులు రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మారే నిబంధనలుకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథ్యంలో ఉద్యోగుల వేతన పంపిణీలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. మీరు ప్రత్యేకంగా పాత పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే ఆటోమేటిక్‌గా కొత్త పన్ను విధానం కిందనే మీ పన్ను లెక్కిస్తారు. ఈ కొత్త విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ సెక్షన్ 80C వంటి మినహాయింపులు ఉండవు. కొత్త విధానంలో ఇచ్చే మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు మేలు కలుగుతుంది.టేక్ హోమ్ శాలరీపై ప్రభావంప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వేతన నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ మొత్తం సిటిసి (CTC)లో కనీసం 50 శాతం ఉండాలి. బేసిక్ శాలరీ పెరిగితే దానికి అనుగుణంగా మీ పీఎఫ్ (PF) కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. పీఎఫ్ వాటా పెరగడం వల్ల నెల నెలా మీ చేతికి వచ్చే నగదు కొంచెం తగ్గే అవకాశం ఉంది. కానీ, ఇది మీ రిటైర్మెంట్ సేవింగ్స్‌ను పెంచుతుంది.పన్ను చెల్లింపులో మార్పు కేవలం జీతం మారడమే కాకుండా అసలైన మార్పు మీరు చెల్లించే పన్నులో కనిపిస్తుంది. కొత్త పన్ను విధానంలో స్లాబులు సవరించడం వల్ల నిర్దిష్ట ఆదాయం ఉన్నవారికి గతంలో కంటే తక్కువ పన్ను పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థ ఆదాయ వర్గాల వారికి ఇది ఊరటనిస్తుంది. జీతం పొందే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం ద్వారా ప్రభుత్వం పన్ను భారాన్ని తగ్గించనుంది. ఇది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి అదనపు ప్రయోజనంగా మారుతుంది.లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర అలవెన్సులుప్రైవేట్ రంగ ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో వచ్చే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పై పన్ను మినహాయింపు పరిమితిని కూడా ప్రభుత్వం పెంచింది. ఇది దీర్ఘకాలంలో ఉద్యోగులకు పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఏప్రిల్ 1 నుంచి మీ శాలరీ స్లిప్ చూడటానికి భిన్నంగా అనిపించవచ్చు. మీ బేసిక్ పే, అలవెన్సులు, పన్ను కోతలు అన్నీ కొత్త నిబంధనలకు అనుగుణంగా మారుతాయి. కాబట్టి, పన్ను ఆదా చేసుకోవడానికి, గరిష్ట ప్రయోజనం పొందడానికి ఏ పన్ను విధానం మీకు లాభదాయకమో ఇప్పుడే లెక్కించుకోవడం ఉత్తమం.