కేడీ పాట వివాదం.. క్షమాపణలు చెప్పిన సింగర్ మంగ్లీ

Wait 5 sec.

‘కేడీ: ది డెవిల్‌’ సినిమాలోని లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ధ్రువ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. సంజయ్‌ దత్‌ - నోరా ఫతేహిలపై ఈ సాంగ్ షూట్ చేశారు. ఇటీవలే పాట రిలీజ్ చేయగా.. అందులోని లిరిక్స్, డ్యాన్స్ మూమెంట్స్ పై విమర్శలు వచ్చాయి. దీనిపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. పాట వివాదంపై ఏకంగా లోక్‌సభలో చర్చ జరిగింది. దీంతో ఈ సాంగ్ తో సంబంధమున్న వారంతా ఒక్కరొక్కరుగా స్పందిస్తున్నారు. ‘సర్కే చునార్‌ తేరీ సర్కే’ పాటకి అర్జున్ జన్యా సంగీతం సమకూర్చగా.. హిందీ, తెలుగు వెర్షన్స్ ని ఆలపించింది. ఒరిజినల్ కన్నడ వెర్షన్ కి డైరెక్టర్ ప్రేమ్ లిరిక్స్ రాయగా.. హిందీలో రకీబ్‌ ఆలం సాహిత్యం అందించారు. తెలుగులో 'జరిపే నాతో పండగ జరిపే' అంటూ చంద్రబోస్ లిరిక్స్ రాశారు. తాను పాడిన పాట వివాదాస్పదంగా మారడంతో సింగర్ మంగ్లీ తాజాగా స్పందించింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని, అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నామని మంగ్లీ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది.''ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఈ పాటను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించడం జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు మీ అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. ఈ పొరపాటుకు మేము నిజంగా చింతిస్తున్నాము. సాంగ్ లిరిక్స్‌ సరిచేసి అప్‌డేట్ చేశాం. సవరించిన పాట ఈరోజు సాయంత్రం విడుదల చేయబడుతుంది. ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తదని మేము మీకు హామీ ఇస్తున్నాము'' అని మంగ్లీ ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలకు, సంగీత దర్శకుడు అర్జున్ జన్యకు కృతజ్ఞతలు చెప్పింది. వారి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపింది ‘సర్కే చునార్‌ తేరీ సర్కే’ పాటపై ఆలిండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ స్పందిస్తూ.. ఈ సాంగ్ ని వెంటనే తొలగించాలని సీబీఎఫ్సీకి ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి అసభ్యకర కంటెంట్ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో . గతంలో వచ్చిన ‘పీలింగ్స్’, ‘డ్రీమమ్ వేకపమ్’, ‘చోళీ కే పీచే’ వంటి వందలాది పాటలు అందరికీ సబబుగానే అనిపించాయని.. కానీ ఈ ఒక్క పాటపై ఇంత గందరగోళం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని పోస్ట్ పెట్టింది. హిందీ గేయ రచయిత రకీబ్‌ ఆలం, నటి నోరా ఫతేహి కూడా ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు.