LPG Cylinders: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మొదలైన తర్వాత భారత్ వంటి చాలా దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఇంధన కొరత ఏర్పడింది. భారత్‌లో పెట్రోల్, డీజిల్ కొరత కంటే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేదిస్తోంది. హార్ముజ్ జల సంధిపై దీంతో దేశంలో ఒక్కసారిగా సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలోనే కమెర్షియల్ వినియోగంపై పరిమితులు విధించిన కేంద్రం గృహ వినియోగానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. అయినప్పటికీ సిలిండర్ల కొరత ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇధర కొరతను అధికమించేందుకు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా సిలిండర్ బరువు తగ్గించే యోచనలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి సంస్థలు ఇకపై గృహ అవసరాలకు 10 కేజీల ఎల్‌పీజీ సిలిండ్రలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జాతీయా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇలా చేయడం ద్వారా గృహ అవసరాలకు ఎక్కువ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయని, ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభం నుంచి ఉపశమనం పొందవచ్చని చమురు కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని 10 కిలోలకు తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, కొత్తగా 10 కిలోల సిలిండర్లను ప్రవేశపెట్టడానికి బదులుగా ప్రస్తుతం ఉన్న పాత సిలిండర్లలోనే 10 కేజీల ఎల్‌పీజీని నింపి అందించే అవకాశాలను పరిశ్రమ వర్గాలు పరిశీలిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకే ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు యోచిస్తున్నట్లు సమాచారం. 10 కిలోల సిలిండర్ ఒక కుటుంబానికి నెల రోజుల పాటు వస్తుందని, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎక్కువ మందికి సిలిండర్లను అందించేందుకు ఈ వ్యూహం పని చేస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లయితే సిలిండర్లపై కొత్త స్టిక్కర్లను అంటించి పంపిణీ చేయవచ్చని కథనాలు పేర్కొన్నాయి. తగ్గించిన గ్యాస్ వివరాలు, అందుకు అనుగుణంగా మారిన రేట్లను దానిపై పేర్కొనవచ్చని తెలిపాయి. అయితే, సిలిండర్లను ఫిల్ చేసే కంపెనీలు కొత్త తూకం విధానాన్ని తీసుకురావడంతో పాటు కొన్ని రెగ్యులేటరీ అనుమతులు సైతం తీసుకోవాల్సి రావచ్చని తెలిపాయి. అయితే, సడెన్‌గా గ్యాస్ తగ్గించడం గందరగోళానికి దారితీయవచ్చని, ప్రజల నుంచి వ్యతిరేకత, రాజకీయంగా విమర్శలు సైతం ఎదురవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ విషయంపై చమురు కంపెనీలు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.