Tax Forms: వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే వారికి బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమవడమే కాదు ఈసారి ఆదాయపు పన్నులకు సంబంధించి కీలక మార్పులు వస్తున్నాయి. కొత్త ఈ క్రమంలో ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుల వ్యవస్థలో సమూల మార్పులు జరగనున్నాయి. దశాబ్దాల కాలం నాటి పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త చట్టం అమలవుతుంది. పన్ను చెల్లింపులను సులభతరం చేస్తూ, క్లిష్టమైన పదాలను తొలగించి, పన్ను నిబంధనల సంఖ్యనూ భారీగా తగ్గించారు. అలాగే కొత్త ట్యాక్స్ ఫారాలూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కువగా ఉపయోగించేవాటి స్థానంలో కొత్త పేర్లతో కొత్త ఫామ్స్ అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ మేరకు ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు కొత్త ఫారాలు ఏది ఎందుకోసం ఉపయోగిస్తారు? పాత ఫామ్స్ స్థానంలో అమలులోకి వచ్చే కొత్త ఫామ్స్ ఏవి అనే వివరాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. మరి పాత కొత్త ఫామ్స్ పూర్తి లిస్ట ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెట్టుబడులపై టీడీఎస్ తప్పించుకునేందుకు డిక్లరేషన్ ఇచ్చే ఫామ్ 15జీ/ఫామ్ 15హెచ్ (Form 15g/15h) స్థానంలో ఇక ఫామ్ 121 (Form 121) ఇవ్వాల్సి ఉంటుంది.ఉద్యోగుల తమ పెట్టుబడులు, హెచ్ఆర్ఏ డిక్లరేషన్ కోసం ప్రస్తుతం ఫామ్ 12బీబీ (Form 12BB) ఉపయోగిస్తుండగా ఇకపై ఫామ్ 124 (Form 124) ఇవ్వాల్సి ఉంటుంది.శాలరీపై టీడీఎస్ సర్టిఫికెట్ కోసం ప్రస్తుతం ఫామ్ 16 (Form 16) ఉపయోగిస్తుండగా దాని స్థానంలో ఫామ్ 130 (Form 130) ఉపయోగించాలి.యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ (AIS) కోసం ఫామ్ 26ఏఎస్ (Form 25AS) స్థానంలో ఫామ్ 168 (Form 168) అందుబాటులో ఉంటుంది.నాన్-శాలరీ టీడీఎస్ సర్టిఫికెట్ కోసం ఫామ్ 16ఏ ఉండగా దాని స్థానంలో ఫామ్ 131 (Form 131) ఉపయోగించాలి.టీసీఎస్ సర్టిఫికెట్ కోసం ఫామ్ 27డీ ఉపయోగిస్తుండగా ఇకపై ఫామ్ 133 (Form 133) ఉపయోగించాలి.క్వార్టర్లీ టీడీఎస్ రిటర్న్ (నాన్-శాలరీ రెసిడెంట్) కోసం ఫారమ్ 26క్యూ ఉపయోగిస్తుండగా దాని స్థానలో ఫామ్ 140 (Form 140) ఉపయోగించాలి.ప్రాపర్టీ, రెంట్, వీడిఏలపై టీడీఎస్ కట్ చేసే వారు ప్రస్తుతం ఫామ్ 26క్యూబీ/క్యూసీ/క్యూఈ ఉపయోగిస్తుంటే దాని స్థానంలో ఫామ్ 141 (Form 141) ఉపయోగించాలి.క్వార్టర్లీ టీడీఎస్ రిటర్న్స్ (నాన్-రెసిడెంట్) కోసం ఫామ్ 27క్యూ స్థానంలో ఫామ్ 144 (Form 144) ఇవ్వాలి.ఫారెన్ రెమిటెన్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఫామ్ 15సీఏ స్థానంలో ఫామ్ 145 (Form 145) ఇవ్వాలి.రెమిటెన్స్ కోసం అకౌంటాంట్స్ సర్టిఫికెట్ ఫామ్ 15సీబీ స్థానంలో ఫామ్ 146 (form 146) ఇవ్వాలి.ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్, స్టేట్మెంట్ ఆఫ్ పర్టికులర్స్‌ కోసం ఫామ్ 3సీఏ,3సీబీ,3సీడీ స్థానంలో ఫామ్ 26 (From 26) ఇవ్వాలి.స్టేట్మెంట్ ఆఫ్ పెర్‌క్వైయిట్స్, అమెనిటీస్ కోసం ఫారమ్ 12బీఏ స్థానంలో ఫామ్ 123 (From 123) ఉపయోగించాలి.రిలీఫ్ ఫర్ శాలరీ ఏరియర్స్ (సెక్షన్ 89) కోసం ఫామ్ 10ఈ స్థానంలో ఫామ్ 39 (Form 39) ఉపయోగించాలి.ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ కోసం ఫామ్ 67 స్థానంలో ఫామ్ 44 (Form 44) ఉపయోగించాలి.అప్లికేషన్ ఫర్ లోవర్ టీడీఎస్, టీసీఎస్ కోసం ఫామ్ 13 స్థానంలో ఫామ్ 128 (Form 128) ఇవ్వాలి.ఫారెన్ సిటిజన్స్, ఎన్ఆర్ఐలు పాన్ అప్లికేషన్ కోసం ఫామ్ 49ఏఏ స్థానంలో ఫామ్ 95 (Form 95) ఇవ్వాలి.