. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ.. తమ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఫామ్‌హౌస్‌లో దొరికిన 11 మందిలో 8 మందికి స్టేషన్ బెయిల్ ఇవ్వగా.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో 11 మందికి డ్రగ్ టెస్ట్‌లు చేయగా.. వారిలో ఆరుగురు వ్యక్తులకు పాజిటివ్ వచ్చింది. అయినప్పటికీ వారిని అరెస్ట్ చేయకపోవడంపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీ పర్యటనలో స్పందించారు. మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో తమ ప్రభుత్వ ప్రమేయం ఏం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్ డ్రగ్స్‌ కేసులో పోలీసులు నిబంధనల ప్రకారమే స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారని పేర్కొన్నారు. అందులో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు 9 మంది అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్‌) వేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మొయినాబాద్‌లో ఓ డ్రగ్స్ పార్టీ జరుగుతోందని తెలంగాణ ఈగల్ టీమ్‌కు పక్కా సమాచారం అందడంతో వారు శనివారం రాత్రి అక్కడికి వెళ్లారు. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఈ పార్టీ జరగ్గా.. అక్కడికి వెళ్లిన పోలీసులపై నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరపడం పెను సంచలనంగా మారింది. ఈ ఘటనలో పైలట్ రోహిత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ఎంపీ, టీడీపీ నేత పుట్టా మహేష్ కుమార్‌, సోదరుడు రితేష్ రెడ్డి సహా మొత్తం 11 మందికి పోలీసులు పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టు ముందు హాజరు పరిచి జైలుకు తరలించారు. ఇక సహా మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో వారు వెళ్లిపోయారు.