‘ధురంధర్ 2’ తెలుగు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ప్రీమియర్ షోలు క్యాన్సిల్

Wait 5 sec.

గతేడాది వచ్చిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం.. 2025లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డులకెక్కింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తెరకెక్కిన పార్ట్ ‘ధురంధర్: ది రివేంజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. అయితే ‘ధురంధర్‌ 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్‌ న్యూస్‌. ‘ధురంధర్’ సినిమాని హిందీలో మాత్రమే రిలీజ్ చేయగా.. ‘ధురంధర్ 2’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళం. కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కి మేకర్స్ ఏర్పాట్లు చేశారు. ఒకరోజు ముందుగానే ఇవాళ (మార్చి 18) పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. తెలుగులో ముందుగానే చూడాలని ప్రీమియర్ షోలకి ఎగబడి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు వారికి నిరాశ ఎదురైంది. తెలుగు ప్రీమియర్లు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.బుధువారం ‘ధురంధర్ 2: ది రివెంజ్‌’ ప్రీమియర్స్‌ను పలు మల్టీప్లెక్స్‌లు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు క్యాన్సిల్‌ చేశాయి. టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రేక్షకులకు అమౌంట్‌ రిఫండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు మెసేజులు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. టెక్నికల్ ఇష్యూతో కంటెంట్ డెలివరీలో ఆలస్యం కారణంగా తెలుగు, తమిళ వెర్షన్ల ప్రీమియర్స్ క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ షోలు మాత్రం ప్రదర్శిస్తారని తెలుస్తోంది. గురువారం యథాతధంగా హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రెగ్యులర్ షోలు ప్రదర్శించనున్నట్లు సమాచారం.* 'ధురంధర్ 2' సినిమా సుమారు 3 గంటల 49 నిమిషాల నిడివితో థియేటర్లలోకి వస్తోంది. మొదటి భాగం ఎక్కడ ఎండ్ అయిందో, అక్కడి నుంచే పార్ట్-2 స్టోరీ ప్రారంభం కానుంది. రణవీర్ సింగ్ తో పాటుగా సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి పాత్రలు రెండో భాగంలో ప్రధానంగా కనిపించనున్నాయి. జియో స్టూడియోస్ సమర్పణలో B62 స్టూడియోస్ బ్యానర్ పై జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ ఈ సినిమాని నిర్మించారు. వికాష్ నౌలాఖా సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం సమకూర్చారు. శివకుమార్ వి. పనికర్ ఎడిటింగ్ చేశారు.