ఇరాన్‌తో ట్రంప్ చేస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ యుద్ధం వల్ల అమెరికన్లకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఓ కొత్త తరాన్ని మరణానికి పంపడాన్ని తాను అంగీకరించలేనని కెంట్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, కేవలం ఇజ్రాయెల్ అధికారులు, దీంతో జోసెఫ్ ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే చర్చ జరుగుతోంది. దేశంలో తీవ్రవాద ముప్పును విశ్లేషించడం, గుర్తించే బాధ్యత కలిగిన సంస్థ అయిన జాతీయ ఉగ్రవాద నిరోధక విభాగానికి కెంట్ నేతృత్వం వహించారు. సీఐఏలో పనిచేస్తూ 11 సార్లు యుద్ధ రంగంలో పాల్గొన్న అనుభవజ్ఞుడిగానూ.... గోల్డ్ స్టార్ పురస్కారం పొందిన భర్తగానూ కెంట్ గుర్తింపు పొందారు. రెండుసార్లు వాషింగ్టన్ స్టేట్ కాంగ్రెషనల్ ఎన్నికల్లో పోటీచేసి.. ఓటమి ఎదుర్కొన్నారు. ఇక, రైట్-వింగ్ భావజాలం కలిగిన మాజీ రాజకీయ నేత అయిన కెంట్.. గతేడాది చీఫ్‌గా ఎన్నికయ్యారు. గత జులైలో ఆయన నియమాకంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించగా.. 52-44 తేడాతో ఆమోదం లభించింది. రైట్-వింగ్ వ్యక్తులతో అనుబంధం, కుట్ర సిద్ధాంతాల్లో సంబంధాలు కారణంగా కెంట్ నియమాకాన్ని ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. 2022 కాంగ్రెషనల్ క్యాంపెయిన్ సందర్భంగా రైట్-వింగ్ మిలటరీ గ్రూప్ ప్రౌడ్ బాయ్స్ సభ్యుడు గ్రాహమ్ జొర్గన్‌సేన్‌ను కన్సల్టింగ్ పనుల కోసం నియమించుకున్నారని, క్రిస్టియన్ జాతీయవాద గ్రూప్ పేట్రియాట్ ప్రేయర్ వ్యవస్థాపకుడు జోయ్ గిబ్సన్‌తో కలిసి పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. తన నియామకంపై సెనేట్‌లో ఓటింగ్ సమయంలో క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి ఫెడరల్ ఏజెంట్లు ప్రేరేపించారన్న కుట్ర సిద్ధాంతాన్ని ఆయన తోసిపుచ్చారు. కెంట్ కుటుంబ నేపథ్యం మొదటి భార్య పేరు షానన్ కెంట్. అమెరికా నేవీలో సీనియర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ అయిన ఈమె 2019లో సిరియాలో విధుల్లో ఉండగా.. అక్కడ జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాంబు దాడిలో తన భార్య ప్రాణాలు కోల్పోవడంతో కెంట్ సీఐఏలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత సీఎన్ఎన్, బ్రైట్‌బార్ట్ న్యూస్, ఫాక్స్ న్యూస్‌లో వంటి మీడియా సంస్థల్లో పనిచేశారు. 2023లో హేథర్ కైజర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా అమెరికా భద్రతా అధికారికాగా.. ఇరాన్, అఫ్గనిస్థాన్ యుద్ధంలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన.. వ్యక్తిగత విషయాలను మాత్రం పంచుకోడానికి ఇష్టపడరు.