.. ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మైనార్టీ కుటుంబానికి కొత్త ఇల్లు కట్టించి.. ఆ కుటుంబంలో రంజాన్ పండుగ వెలుగులు నింపారు. గతేడాది రంజాన్ సందర్భంగా నారా లోకేష్.. మంగళగిరి బస్టాండ్ సమీపంలోని షేక్ షహెన్సా అనే ముస్లిం ఇంటిని సందర్శించారు. షహెన్సా కుటుంబసభ్యులతో ముచ్చటించిన నారా లోకేష్.. ఇఫ్తార్ విందు స్వీకరించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. షహెన్సా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు నివసిస్తున్న ఇంటిని పరిశీలించారు నారా లోకేష్. ఇల్లు పాతపడిపోయి ఉండటంతో వివరాలను తెలుసుకున్నారు.అది తమ పూర్వీకులు నిర్మించిన రేకుల ఇల్లు అని.. ప్రభుత్వం తరుఫున తమకు కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని షహెన్సా కుటుంబం ఈ సందర్భంగా నారా లోకేష్‌ను కోరింది. దీంతో ఆ కుటుంబం బాధ్యతను తాను తీసుకుంటానన్న నారా లోకేష్.. వారికి కొత్త ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే.. ఏడాది లోపు కొత్త ఇంటిని నిర్మించి.. షహెన్సా కుటుంబానికి అప్పగించారు. దీంతో షహెన్సా కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. నారా లోకేష్ తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని షహెన్సా కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనేషహెన్సా కుటుంబానికి కట్టించిన కొత్త ఇంటి వీడియోను, ఆ కుటుంబం ఆనందాన్ని ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు. "గత రంజాన్ సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన షేక్ షహెన్షా కుటుంబానికి కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వడం ఆనందంగా ఉంది. పేద కుటుంబానికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావిస్తున్నాను.మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు." అంటూ నారా లోకేష్ వీడియోను షేర్ చేశారు. ఓ వైపు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే అంశాలపై . సోషల్ మీడియా ద్వారా వచ్చే వినతులు, విజ్ఞప్తులు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు. అలాగే సంబంధిత మంత్రిత్వశాఖలకు వాటిని చేరవేస్తూ.. పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటారు.