తెలంగాణ ప్రభుత్వం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇళ్ల లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్ చెప్పారు. ఇక నుంచి ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ప్రారంభమైన తొలినాళ్లలో ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేసేవారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ తర్వాత బిల్లుల విడుదల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా.. ప్రతివారం బిల్లులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. తెలంగాణలో ఏ కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామ‌ని భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు చేస్తోన్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన త్వరత్వరగా ఇళ్లను నిర్మించుకోవాలని ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులకు సూచించారు. ప్రతి వారం అందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కీలక ప్రకటన చేశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలను ప్రతిపక్షాలు కావాలనే విమర్శిస్తున్నాయని ఫైరయ్యారు. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు వర్తించేలా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతా లభిస్తుందని భీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఉన్న పరిమితులను తొలగించి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు చేశారు. ఇప్పటికే కొన్ని ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక ఏఫ్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వం ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిచనున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులపై భట్టి చేసిన ప్రకటనతో ఇండ్ల నిర్మాణంలో వేగం పుంజుకోనుంది.