పాకిస్థాన్ అణు రికార్డుపై భారత్ తీవ్ర విమర్శలు గుప్పించింది. పాక్ రహస్య అణు విస్తరణ చరిత్ర, ఆ దేశాన్ని ప్రపంచానికి ఒక ముప్పుగా మారుస్తోందని విమర్శించింది. విచారణలో వెల్లడించిన నేపథ్యంలో భారత్ స్పందించింది. అణ్వాయుధ తయారీలో పాకిస్థాన్‌కు ఘనమైన చరిత్రే ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. ‘‘పాకిస్థాన్ విషయానికి వస్తే, వారికి ఒక చరిత్ర ఉంది. అణు వ్యాప్తి నిరోధక విషయంలో రహస్య కార్యకలాపాలు సాగించిన చరిత్ర వారికి ఉంది.. వారి ఈ రహస్య అణు కార్యకలాపాల కారణంగా వారు ప్రపంచానికి ఎటువంటి ముప్పును కలిగిస్తున్నారో, ఇటువంటి ప్రకటనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి’’ అని అన్నారు.ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ 2026 వార్షిక ముప్పు అంచనాలను బుధవారం సెనేట్‌‌ ముందుంచారు. ఈ సందర్భంగా అమెరికాకు అణు ముప్పు కలిగించే దేశాల్లో రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌తో పాటు పాకిస్థాన్ కూడా ఒకటని తెలిపారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్,వ్యవస్థలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయని, అమెరికాను వాటి పరిధిలోకి తీసుకొస్తాయని గబ్బార్డ్ వివరించారు. ఇదే సమయంలో ఉత్తర కొరియాకు రష్యా, చైనాలతో పెరుగుతున్న సహకారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలలో అల్-ఖైదా, ఐసిస్‌ ఉగ్రవాద సమూహాల ఉనికి విదేశాలలో అమెరికా ప్రయోజనాలకు దీర్ఘకాలిక ముప్పుగా గబ్బార్డ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ మాట్లాడుతూ.. తమ అణు కార్యక్రమం ప్రపంచంలో శక్తి ప్రదర్శించుకోడాని కాదని, కేవలం కనీస నిరోధకత కోసమే ఉద్దేశించిందని అన్నారు.అణ్వాయుధాలను అభివృద్ధిలో పాక్ ప్రాథమిక ఉద్దేశం భారత్‌ను ఎదుర్కోవడమే, కానీ దాని రూపశిల్పి అబ్దుల్ ఖదీర్ ఖాన్ నాయకత్వంలో ఇస్లామాబాద్ తన అణు సాంకేతికతను ఇరాన్‌తో సహా ఇతర ఇస్లామిక్ దేశాలకు విస్తరించి, వేగవంతం చేయాలనే ఆలోచన ఇస్లామిక్ బాంబుగా మార్చిందని 2025లో మాజీ సీఐఏ అధికారి రిచర్డ్ బార్లో అన్నారు.