తమపై ఇజ్రాయెల్- అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్యం సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుంది. ఇదే సమయంలోనియంత్రిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ జల సంధిలో నౌకల రవాణాపై ఇరాన్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. జల మార్గం గుండా రాకపోకలు సాగించే నౌకలు ఇకపై కొంత ఫీజుగా చెల్లించాల్సి రావొచ్చని భోగట్టా. ఆయిల్ ట్యాంకర్లపై టోల్‌ ఫీజు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇరాన్ చట్టసభ సభ్యుడు సొమాయే రఫీయే తెలిపారు. స్థానిక మీడియాతో సొమాయే మాట్లాడుతూ.. రవాణా, ఇంధనం, ఆహార భద్రత కోసం సురక్షిత మార్గంగా కోసం హర్మూజ్‌ జల సంధిని ఉపయోగించుకునే దేశాలు టోల్ ఫీజులు చెల్లించేలా బిల్లును తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తమ శక్తి సామర్థ్యాలతో జల సంధిలో భద్రత కల్పిస్తామని, దానికి ప్రతిఫలంగా దేశాలు కొత్త మొత్తం చెల్లించాలని ఆమె అన్నారు. ‘‘యుద్ధం ముగిసి సాధారణ పరిస్థితులు నెలకున్న తర్వాత హర్మూజ్‌ జల సంధి రవాణాలో కొత్త విధివిధానాలు రాబోతున్నాయి. మాపై ఆంక్షలు విధించిన దేశాలపై మేమూ అటువంటి చర్యలే తీసుకునేలా నిర్ణయాలు ఉంటాయి’’ అని ఇప్పటికే ఇరాన్ ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా అమెరికా, ఇజ్రాయెల్‌ ట్యాంకర్లకు మాత్రమే హర్మూజ్‌ను మూసివేసినట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇటీవల వెల్లడించారు. ఇతర దేశాల నౌకలకు ఎటువంటి ఆటంకం కల్పించబోమని, అవి స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. మరోవైపు తమ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు దిగినట్టు తెలిపింది. దీంతో యుద్ధం మరో మలుపు తిరిగింది. తమ సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని ఇరాన్‌కు సౌదీ అరేబియా హెచ్చరించింది. ఖతార్‌లోని రాస్ లఫాన్ గ్యాస్‌పై దాడితో అక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదేళ్ల తర్వాత ఆ ఫీల్డ్‌లో ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే మొదటిసారి. ఈ కేంద్రంలో అమెరికాకు చెందిన ఎక్సాన్‌మొబిల్, చెవ్రాన్, యూకే సంస్థ షెల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు, హర్మూజ్‌లో నౌకల సురక్షిత రవాణా కోసం తమ వంతు సహకారం అందించనున్నట్టు యూకే, ఫ్రాన్స్ సహా ఐదు ఐరోపా దేశాలు, జపాన్ గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లోని చమురు, గ్యాస్ మౌలిక సౌకర్యాలపై ఇరాన్ దాడులను అవి తీవ్రంగా ఖండిచాయి.