తొలి దశ డీపీఆర్ తయారైందని మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు. మూసీ పునర్నిర్మాణంలో 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. తుది ఎన్యూమరేషన్ కొనసాగుతుందని.. బఫర్‌జోన్‌లో ఉన్నవారికి టీడీఆర్ ఇస్తామన్నారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, ప్రకటించారు. 'గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే... బఫర్‌జోన్ నిర్ణయించాం. మేం . 2024 డిసెంబర్‌లో మెయిన్‌హార్ట్‌కు డీపీఆర్‌ బాధ్యతలు అప్పగించాం. 2026 ఫిబ్రవరిలో మెయిన్‌హార్ట్ సంస్థ డీపీఆర్ అప్పగించింది. కేటీఆర్‌ ఆరోపిస్తున్నట్లు మూసీ డీపీఆర్‌ రెండు నెలల్లో పూర్తి కాలేదు. వచ్చే ఏడీబీ బోర్డు మీటింగ్‌లో మూసీ ప్రాజెక్టుకు అనుమతి లభించే అవకాశం.బీఆర్‌ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ఆపేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రాజెక్టులను మేము నిలిపేసినట్లు బీఆర్‌ఎస్ ఆరోపించడం సరికాదు. ఎస్టీపీలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ హయాంలో 30 శాతం పనులు పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న 70 శాతం పనులు మా హయాంలో పూర్తయ్యాయి. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పనులు.. చిన్న వరదకే కొట్టుకుపోయాయి. మురికి కాలువగా ఉన్న జీవనది మూసీని అభివృద్ధి చేయడం తప్పా? మూసీ అభివృద్ధికి ఎందుకు అడ్డుపడుతున్నారు.' అని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. అంతకు ముందు మాట్లాడిన కేటీఆర్.. మూసీ డీపీఆర్‌ తయారుచేసేందుకే 18 నెలలు పడుతుందని చెప్పి... రెండు నెలల్లోనే పూర్తి చేశారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ డీపీఆర్‌ పూర్తయి ఉంటే.. మా ముందు పెట్టాలన్నారు. డీపీఆర్‌ మాకు ఇంతవరకు అందలేదని ఏడీబీ చెబుతుందని.. డీపీఆర్‌ తయారుకాకుండా తయారైందని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైరయ్యారు. మూసీ డీపీఆర్‌ బాధ్యతలను మెయిన్‌హార్ట్‌కు అప్పగించారని.. మెయిన్‌హార్ట్ సంస్థపై పాకిస్థాన్‌ ప్రభుత్వం రెడ్‌కార్నర్ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. మూసీ పునర్నిర్మాణంలో 1400 నిర్మాణాలు పోతాయని మంత్రి చెబుతుంటే.. 10 వేల నిర్మాణాలు పోతాయని గెజిట్ చెబుతోందని అన్నారు. మంత్రి చెబుతున్నది కరెక్టా?... ప్రభుత్వ గెజిట్‌లో చెబుతున్నది కరెక్టా? అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేటీఆర్ ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.