ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఈవెంట్‌లో ‘నాయుడు’ కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన నటుడు పార్తీబన్

Wait 5 sec.

నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, ఉగాది కానుకగా రేపు(మార్చి 19) థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. సినిమాలో విలన్‌ పాత్రలో నటించిన తమిళ్ యాక్టర్ రాధాకృష్ణన్ పార్తిబన్‌ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన స్పీచ్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై పార్తిబన్‌ వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఈవెంట్‌లో పార్తిబన్‌ తనను తాను పరిచయం చేసుకుంటూ కులం పేరును ప్రస్తావించారు. తాను నాయుడు అబ్బాయినని, కానీ పుట్టి పెరిగిందంతా చెన్నైలో కాబట్టి తెలుగు కంటే తమిళ్ బాగా మాట్లాడతానని ఆయన అన్నారు. వేదికపై క్యాస్ట్ ని ప్రస్తావించడంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. దీంతో పార్తిబన్‌ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని చెబుతూ, తాను కులవ్యవస్థను తప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాననే విషయాన్ని గుర్తు చేశారు.* ''నిజాయితీగా చెబుతున్నాను.. మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా, నేను చిత్తశుద్ధితో మాట్లాడుతున్నాను. నేను ఏ అవకాశాన్ని ఆశించో లేదా నా వ్యక్తిగత సౌలభ్యం కోసమో నేను ఆ రెండు మాటలను అస్సలు ఉపయోగించలేదు. అక్కడ మాట్లాడితే ఇక్కడకి తెలియదని అనుకుని నేను మాట్లాడే వ్యక్తిని కాదు. అనుకోకుండా నోరు జారి అలా మాట్లాడటం జరిగింది. అదీ కూడా నేను ఆ మాటలను కేవలం పరిహాసపూర్వకంగానే పలికాను. అయినప్పటికీ, నా ఇన్నేళ్ల అనుభవంలో, నేను ఒక కులం పేరును స్పష్టంగా ప్రస్తావించడం ఇదే మొట్టమొదటిసారి''''నిజానికి కులానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, దానిని గొప్పగా చాటుకునే వారిని నేనే స్వయంగా తీవ్రంగా ద్వేషిస్తాను. ‘ఇవన్’ సహా అనేక సినిమాల్లో, వివిధ బహిరంగ వేదికలపైనా నేను ఇటువంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండించాను. అలాంటి దృక్పథం కలిగిన నేను, స్వయంగా ఉద్దేశపూర్వకంగా అటువంటి పని ఎప్పుడైనా చేస్తానా?. తప్పు జరిగిందని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నిజంగా అందుకు నేను చింతిస్తున్నాను. ఇంతమంది ప్రజల మనస్తాపానికి నేనే కారణం కావడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది''''నేను కేవలం నా ప్రతిభను మాత్రమే నమ్ముకుంటాను. నా జీవనోపాధి కోసం కులాన్ని ఒక సాధనంగా వాడుకోవాలనే కోరిక లేదు. జాతి పేరుతో ఎదగాలని నేను పొరపాటున కూడా ఎప్పుడూ అనుకోను. ఇది మళ్ళీ ఎప్పటికీ జరగదు. పొరపాటున కూడా ఇంకోసారి జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాటల వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికీ, నేను నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి, గతంలో మాదిరిగానే నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను''''ఈ సంఘటన వల్ల మీకంటే నేనే మరింత ఎక్కువగా మనస్తాపానికి గురయ్యాను. మీరు నాపై కురిపించిన ప్రేమను, ఆప్యాయతను కాపాడుకోవడంలో ఈ క్షణం నుంచి నేను మరింత అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరిస్తాను'' అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ''కేవలం స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రమే కాదు, ఏ తప్పు జరిగినా వెంటనే సరిచేసుకోవాలని నేను నమ్ముతాను. అందుకే సరిచేసి మళ్లీ పోస్ట్ చేస్తున్నాను'' అంటూ ఆయన ఎక్స్ లో అదే పోస్టుని మళ్లీ పోస్ట్ చేశారు. ఇటీవల .2012లో రామ్ చరణ్ హీరోగా నటించిన 'రచ్చ' సినిమాలో పార్తీబన్ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో ప్రతినాయకుడి పాత్ర పోషించారు.