తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

Wait 5 sec.

తెలంగాణకు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు ద్రోణి ఏర్పడిందని.. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. రానున్న నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరికొన్ని గంటల్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమయంలో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇక దక్షిణ హైదరాబాద్ ప్రాంతంపై భారీ ఉరుములతో కూడిన తుపాను మేఘాలు కమ్ముకున్నాయని అధికారులు హెచ్చరించారు. మహేశ్వరం, షాద్ నగర్ మీదుగా వస్తున్న భారీ తుపాను మేఘాలు నగరాన్ని ఇప్పటికే తాకాయన్నారు. దీని ప్రభావంతో శంషాబాద్, రాజేంద్రనగర్, బహదూరుపురా, కార్వాన్, కాటేదాన్, బార్కాస్, చంద్రాయణగుట్ట, చార్మినార్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, బండ్లగూడ జాగీర్ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత ఈ వాతావరణం నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కూడా విస్తరించనుందని చెప్పారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, లక్డీకపూల్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని అంటున్నారు. భారీ గాలుల వల్ల హోర్డింగ్స్, చెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ఆరబోసిన ధాన్యం విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.