కనీస పెన్షన్ రూ.7500లకు పెంపుపై.. పార్లమెంటులో కేంద్రం క్లారిటీ.. ఏం చెప్పిందంటే?

Wait 5 sec.

EPS Pension: ఉద్యోగుల భవిష్యనిధిలోని పింఛను పథకం ఈపీఎస్-95 కింద ఉద్యోగుల కనీస పెన్షన్ పెంచాలని దీర్ఘకాలంగా డిమాండ్లు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణంగా కారణంగా ప్రస్తుతం అందిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ సరిపోవడం లేదని ఈపీఎస్ పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ వైఖరి తెలియజేస్తూ వస్తోంది. తాజాగా కనీస పెన్షన్ పెంపుపై పార్లమెంటులో చర్చకు వచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్-95 పరిధిలోని కనీస పెన్షన్ రూ.1000 నుంచి పెంచుతున్నారా? అని లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా సమాధానం ఇచ్చారు. 'ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన పెన్షనర్లకు కనీస ఈపీఎస్ పెన్షన్ నెలకు రూ.1000 అందిస్తోంది. అయితే, పెన్షన్‌లో సవరణ చేసే నిర్ణయం తీసుకునే ముందు పెన్షన్ ఫండ్ పథకం స్థిరత్వాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం ప్రస్తుతం EPS కింద పెన్షనర్లకు నెలకు కనీసం రూ. 1,000 పెన్షన్‌ను నిర్ధారించడానికి బడ్జెట్ మద్దతును అందించడం ద్వారా మద్దతు ఇస్తుంది. ఈ మద్దతు ఈ పథకానికి ప్రభుత్వం వార్షికంగా చెల్లించే 1.16 శాతం వేతన సహకారానికి అదనంగా ఉంటుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదన లేదు' అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా క్లారిటీ ఇచ్చారు. ఈపీఎఫ్ కనీస పెన్షన్ రూ.1000 నుంచి పెంచాలన్న డిమాండ్ పెరుగుతున్న క్రమంలో లోక్‌సభ సభ్యుడు ఎన్‌కే ప్రేమచంద్రన్ ఈ అంశంపై ప్రశ్నలు అడిగారు. అలాగే అధిక పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు కావాల్సినంత సమయం ఇస్తున్నారా? అని మరో ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా సమాధానం ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ఆన్‌లైన్ సిస్టమ్ తీసుకొచ్చిందని, దీని ద్వారా జాయింట్ ఆప్షన్ అప్లికేషన్లు సమర్పించవచ్చని తెలిపారు. అధిక వేతనాలపై అధిక పెన్షన్ పొందేందుకు అర్హులైన ఈపీఎఫ్ సభ్యులకు అవకాశం కల్పించాలని గతంలోనే సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో చాలా మంది అధిక పెన్షన్ కోసం అధిక కంట్రిబ్యూషన్ చేయాలని కోరుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రు తమ పీఎఫ్ ఖాతాకు 12 శాతం కంట్రిబ్యూట్ చేస్తారు. అలాగే కంపెనీలు 12 శాతం నిధులను జమ చేస్తాయి. అందులో 8.33 శాతం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్‌కి వెళుతుంది. దీని ఆధారంగానే పెన్షన్ అనేది వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం సైతం 1.16 శాతం చొప్పున ఈ పెన్షన్ ఫండ్‌కి ప్రతి ఏటా జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఈ నిధి అదనమని కేంద్ర మంత్రి తెలిపారు.