భారీగా తగ్గి ఇప్పుడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే?

Wait 5 sec.

22k Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట కలిగింది. ఒకవైపు అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. తగ్గుతుండటం విశేషం. సాధారణంగా ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో.. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బంగారం ధరలు తగ్గుతుండటం విశేషం. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కాగా.. అక్కడి నుంచి 2-3 రోజులు మాత్రమే బంగారం ధర పెరిగింది. మిగతా అన్ని రోజుల్లోనూ గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టింది. దీంతో కొనుగోలుదారులకు ఊరట కలిగిందని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గేందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మార్చి 16న (సోమవారం) బంగారం, వెండి రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. >> ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఇప్పుడు ఔన్సుకు 5020 డాలర్ల స్థాయిలో ఉంది. శని, ఆదివారాల్లో కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉంది. సిల్వర్ రేటు చూస్తే ప్రస్తుతం 80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 92.48 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. మార్చి 16న ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులం రూ. 1,46,350 వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా రూ. 950, రూ. 1400, రూ. 1000 తగ్గుముఖం పట్టింది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1,59,660 వద్ద ట్రేడవుతోంది. ఇది అంతకుముందు వరుస సెషన్లలో రూ. 1030, రూ. 1530, రూ. 1090 మేర పతనమైంది. బంగారం ధర బాటలోనే వెండి రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 2.80 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు మార్చి 14న రూ. 10 వేలు, మార్చి 12న రూ. 10 వేల మేర తగ్గుముఖం పట్టింది. ఇది గరిష్ఠాల నుంచి రూ. 1.50 లక్షల వరకు తగ్గడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా మార్చి 16న ఉదయం 10 గంటల తర్వాత మారనున్నాయని చెప్పొచ్చు. మళ్లీ తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. యూఎస్ డాలర్ పుంజుకోవడం వల్ల బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయని చెప్పొచ్చు.