'ఒడిశాలో ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ రూ.5 కోట్లు ఆఫర్ చేసింది': డీకే శివకుమార్

Wait 5 sec.

DK Shivakumar Slams BJP Over Operation Lotus: దేశ రాజకీయాల్లో మరోసారి రిసార్ట్ పాలిటిక్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల వేళ ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరు శివార్లలోని బిడది వద్ద ఉన్న ఒక రిసార్ట్‌లో బస చేసిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నామని.. వారు తమ నేరాన్ని కూడా అంగీకరించారని ఆయన వెల్లడించారు.ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు.. రెండు చెక్కులు!రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలంటూ ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 5 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చారని డీకే శివ కుమార్ తెలిపారు. ఆదివారం రోజు ఉదయం నలుగురు వ్యక్తులు రిసార్ట్‌లోకి ప్రవేశించి.. అక్కడ ఉన్న ఒకరిని కలిశారని అన్నారు. ఒక్క ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ప్రలోభ పెట్టారని తెలిపారు. నిందితులు వారితో పాటు రెండు చెక్కులను కూడా తెచ్చారని.. అయితే ఎమ్మెల్యేలు ఆ ఆఫర్‌ను తిరస్కరించడమే కాకుండా వారిని పట్టుకునే ప్రయత్నం చేశారని డీకేఎస్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తప్పించుకోగా.. బీరేంద్ర ప్రసాద్, సీమాచల్ మొహాకుద్ అనే వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. బెంగళూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తి సహకారంతో వారు ఆన్‌లైన్‌లో రూమ్‌ బుక్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.పోలీసులకు ఫిర్యాదు.. ప్రాణహాని ఉందని ఆవేదనఒడిశా కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత అశోక్ కుమార్ దాస్ ఈ ఘటనపై బిడది పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు బేరసారాలకు ఒప్పుకోకపోవడంతో.. నిందితులు బూతు పురాణం విప్పడమే కాకుండా.. తిరిగి ఒడిశాకు వస్తే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో బీరేంద్ర ప్రసాద్, సురేష్, అజిత్ కుమార్ సాహు, సీమాచల్ మొహాకుద్ పేర్లను చేర్చారు. తమ ఎమ్మెల్యేలను ప్రభావితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. అందుకే మార్చి 12వ తేదీ నుంచి వారిని రిసార్ట్‌లోనే సురక్షితంగా ఉంచుతున్నామని అశోక్ కుమార్ తెలిపారు.చెక్కులను ఫోరెన్సిక్ విచారణకు పంపే అవకాశం.. ప్రస్తుతం రామనగర జిల్లా పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న చెక్కులను ఫోరెన్సిక్ విచారణకు పంపే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 16న జరిగే రాజ్యసభ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి.