నెల్లూరు జిల్లాకు మహర్దశ.. 10 వేల ఎకరాల్లో 'క్రిస్ సిటీ', సదుపాయాలు ఇవే..

Wait 5 sec.

నెల్లూరు జిల్లాకు మహర్దశ పట్టనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో (Krishnapatnam Industrial Smart City) ఏర్పాటు కానుంది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవా (CBIC)లో భాగంగా ఈ క్రిస్‌ సిటీ రూపుదిద్దుకుంటోంది. పారిశ్రామిక అవసరాలతో పాటు.. రెసిడెన్షియల్‌ జోన్లు సైతం అభివృద్ధి చేస్తున్నారు. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు మెుత్తం మూడుదశల్లో కలిపి 10,834 ఎకరాల్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించాలన్నది సర్కార్ టార్గెట్. తొలిదశలో 2,006.09 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అందుకు రూ.1,174 కోట్లు ఖర్చుచేస్తోంది. 2028 జనవరి నాటికి తొలిదశ ప్రాజెక్టు పనులు పూర్తికానున్నాయి. క్రిస్‌ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలతో పాటుగా ఆయా పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది అక్కడే ఉండేందుకు రెసిడెన్షియల్‌ జోన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పారిశ్రామిక పార్కులకు భిన్నంగా ఈ క్రిస్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. ఇళ్ల నుంచి నేరుగా ఆఫీసులకు నడిచి వెళ్లేలా వాక్‌ టు వర్క్‌ సదుపాయాలు కల్పించనున్నారు. వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లు, గ్రీనరీతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మెుత్తం16 లొకేషన్లలో రెసిడెన్షియల్‌ జోన్లు, ప్రైవేటు కార్యాలయాలు, ఆర్ట్‌ గ్యాలరీ.. కల్చరల్‌ సెంటర్‌, ప్రైవేట్‌ ఆసుపత్రి, పబ్లిక్‌ లైబ్రరీ, స్పోర్ట్స్‌ సెంటర్‌, కమ్యూనిటీ హాల్‌, రిటైల్‌ షాపింగ్‌ మాల్‌, పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రం, పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విద్యుత్‌లైన్లు, డ్రింకింగ్ వాటర్ సరఫరా లైన్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ మొత్తం అండర్ గ్రౌండ్ విధానంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్‌.. ఫార్మారంగాల పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా క్రిస్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. అందుకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ను అధికారులు రూపొందించారు. ఇప్పటికే 35 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బోర్డు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌కు కేంద్రం ఇప్పటికే పర్యావరణ అనుమతులు ఇచ్చిందని అధికారులు తెలిపారు.