ముంబై క్యాంప్‌లోకి రోహిత్ ఎంట్రీ.. హిట్‌మ్యాన్ ఐపీఎల్ ప్రాక్టీస్ షురూ

Wait 5 sec.

సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో అడుగుపెట్టాడు. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు, ఈ ఏడాది టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ, మొత్తం ఆరు టైటిల్స్ గెలిచాడు. అందులో ఒకటి డెక్కన్ ఛార్జస్ తరఫున కాగా, మిగతా ఐదు టైటిల్స్‌ను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా అందించాడు.2011లో ముంబై జట్టులో చేరిన రోహిత్, 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే జట్టుకు తొలి టైటిల్ అందించాడు. ఆ తర్వాత 11 సంవత్సరాల పాటు జట్టును నడిపించిన హిట్ మ్యాన్, 2024 సీజన్‌కు ముందు కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు.బ్యాటింగ్ పరంగా కూడా రోహిత్ శర్మ ఎంఐకి కీలక స్తంభంగా నిలిచాడు. ఐపీఎల్‌లో 6000కి పైగా పరుగులు చేసిన అరుదైన బ్యాటర్లలో హిట్‌మ్యాన్ ఒకరు. 2013 సీజన్‌లో 538 పరుగులు చేసి ముంబై టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2015 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం ఆయన కెరీర్‌లో మరో ముఖ్య ఘట్టం. ఆయన నాయకత్వంలో ఎంఐ 2017, 2019, 2020 సీజన్లలో కూడా ట్రోఫీని దక్కించుకుంది.ఇక సోమవారం నుంచి ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ట్రైనింగ్‌ను అధికారికంగా ప్రారంభించింది. హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఆధ్వర్యంలో జరిగిన ఈ సెషన్‌లో బౌలింగ్ కోచులు, ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్‌తో పాటు ఫిట్‌నెస్, ఫిజియో టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయవర్ధనే మాట్లాడుతూ “ప్రీ-సీజన్ తొలి రోజు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్లేయర్లు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగానే ఎనర్జీ పెరుగుతుంది. మొదటి రోజు నుంచే మా లక్ష్యం స్పష్టంగా ఉంది బలంగా ప్రారంభించడం” అని తెలిపాడు.“మా జట్టులో అనుభవజ్ఞులు ఉన్నారు, కొత్తగా వచ్చిన ప్లేయర్లు కూడా ఉత్సాహంగా ఉన్నారు. తొలి రోజు నుంచే మా అప్రోచ్, ప్రిపరేషన్ ఎలా ఉండాలో అందరికీ తెలియాలి” అని మహేల పేర్కొన్నాడు. త్వరలో మిగతా ఆటగాళ్లు కూడా క్యాంప్‌లో చేరనున్నారు. ముంబై ఇండియన్స్ స్క్వాడ్హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, రాజ్ బవా, రఘు శర్మ, మిచెల్ శాంట్నర్, కార్బిన్ బోష్, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అల్లా ఘఫన్జార్, అశ్వాని కుమార్, దీపక్ చహర్, విల్ జాక్స్, షెర్ఫేన్ రూదర్‌ఫోర్డ్, మయాంక్ మార్కండే, శార్దుల్ ఠాకూర్, క్వింటన్ డికాక్, డానిష్ మలేవర్, మహమ్మద్ ఇజ్హార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్.