'రెస్పెక్ట్ లేదు' మెక్‌కల్లమ్‌పై లివింగ్‌స్టోన్ సంచలన ఆరోపణలు

Wait 5 sec.

ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశాడు. హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో పాటు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2025 మార్చిలో దారుణమైన ఫామ్ కారణంగా జట్టులోంచి బయటకెళ్లిన లివింగ్‌స్టోన్, ప్రస్తుత మేనేజ్‌మెంట్‌లో తిరిగి అవకాశాలు రావడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. ఈఎస్‌పీఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు.తనను వెస్టిండీస్ సిరీస్‌కు డ్రాప్ చేస్తున్నట్లు మెకల్లమ్ చేసిన ఫోన్ కాల్ ఒక నిమిషం కూడా నిలవలేదని లివింగ్‌స్టోన్ చెప్పాడు. “ఎందుకు డ్రాప్ చేస్తున్నారని అడిగితే మరో ఆటగాడిని ప్రయత్నించాలనుకుంటున్నాం అని మాత్రమే చెప్పారు” అని వెల్లడించాడు. “సెలెక్టర్ ల్యూక్ రైట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాత్రం ఒక మెసేజ్ పంపాడు. అది ఆ గ్రూప్ మొత్తం పరిస్థితిని చూపిస్తుంది” అని విమర్శించాడు.ఇంకా తనతో మాట్లాడలేదని “సమ్మర్‌లో మాట్లాడుతాను” అని చెప్పి ఆ తర్వాత నెలల పాటు సంప్రదించలేదని లివింగ్‌స్టోన్ ఆరోపించాడు. “నేనే ఒకసారి కాల్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పాడు. సెప్టెంబర్ చివరికి మాత్రమే మాట్లాడాడు,” అని పేర్కొన్నాడు. ఈ అనుభవం తనకు పెద్ద పాఠం నేర్పిందని లివింగ్‌స్టోన్ చెప్పాడు. “జట్టులో ఉంటేనే విలువ, లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ఇకపై నా క్రికెట్‌ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాను” అని అన్నాడు.అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో ఎదురైన ఇబ్బందులను కూడా గుర్తు చేసుకున్నాడు. కోచింగ్ స్టాఫ్‌ను సహాయం కోసం సంప్రదిస్తే “నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు కాస్త రిలాక్స్ అవ్వు” అని చెప్పారని తెలిపాడు. “పర్ఫార్మెన్స్ బాగోలేకపోతే ఖకచ్చితంగా బాధపడతాం. నేను పట్టించుకోకపోతే ఈ క్రీడనే ఆడను. ఇండియా, పాకిస్తాన్ టూర్‌లో మా ప్రదర్శన బాగోలేదు, కానీ అది ఒక్కడిదే కాదు అందరికీ అలాగే జరిగింది” అని లివింగ్‌స్టోన్ స్పష్టం చేశాడు.