తెలంగాణ ప్రజలకు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, జ‌గిత్యాల‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, నిర్మల్, మెదక్ జిల్లాలో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ జిల్లాల్లో ఉరుములతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అదే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు వాతావరణశాఖ కూడా జారీ చేసింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో వర్షం ప్రారంభం కాగా... ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. గురువారం (మార్చి 19) తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వైరాలో 4 సెం.మీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌లో 4 సెం.మీ, జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో 2 సెం.మీ, ఖమ్మం జిల్లా మధిరలో 1 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోనూ జల్లులు కురిశాయి. అదే సమయంలో రానున్న మూడు రోజుల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర పెరగనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది.ఇక ఈ ఏడాది విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా మార్చి మెుదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి రెండో వారం నుంచే భానుడి భగభగలు మెుదలయ్యాయి. మార్చి మెుదటి వారానికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. మాడు పగిలే ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ తర్వాత గత ఐదు రోజులుగా వాతవరణంలో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ద్రోణి ప్రభావంతో వాతావరణం ఆహ్లాదంగా మారిపోయింది. మార్చి 16 నుంచి రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు రైతులను ఇబ్బందులకు గురి చేశాయి. మరో రెండ్రోజులు వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.