మహిళలకు శుభవార్త.. ఒక్కరోజే రూ. 7 వేలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతో తెలుసా?

Wait 5 sec.

Gold Silver Prices: పసిడి ప్రియులకు భారీ ఊరట దక్కింది. బంగారం ధర వరుసగా పతనం అవుతూనే ఉంది. అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతున్నా.. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న క్రమంలో పసిడి, వెండి ధరలు పడిపోతున్నాయి. సాధారణంగా ఇలాంటి సంక్షోభ సమయాల్లో బంగారం ధర భారీగా పెరగాల్సి ఉంటుంది. వీటిని సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించి.. అటువైపు పెట్టుబడులు పెడుతుంటారు. ఫలితంగా ధర కూడా పెరగాల్సి ఉంటుంది. కానీ ఈసారి అలా జరగట్లేదు. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది ప్రజల్ని బంగారం కొనుగోలు చేయడం కంటే నిత్యావసరాల కొనుగోళ్లకే మొగ్గూచూపేలా చేస్తోంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడంతో కూడా తగ్గుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిల్లో ఉన్నప్పుడు.. డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ వంటివి అధిక రాబడి అందిస్తుంటే.. బంగారం, వెండి వంటి లోహాలు ఆకర్షణ కోల్పోతాయి. ఇప్పుడదే జరుగుతోంది. డాలర్ విలువ భారీగా పెరగడం కూడా బంగారం, వెండి ధరల పతనానికి కారణం. రూ. 7 వేలకుపైగా తగ్గిన బంగారం ధర..యుద్ధం ప్రారంభమైన మార్చి నెల ఆరంభం నుంచి వరుసగా తగ్గుతూనే ఉన్న బంగారం ధర.. ఇప్పుడు మార్చి 19-20 తేదీల్లో మరింత భారీగా తగ్గింది. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర ఒక్కరోజులోనే ఏకంగా రూ. 7140 తగ్గడంతో 10 గ్రాములకు ప్రస్తుతం మార్చి 20 ఉదయం 7 గంటలకు రూ. 1,50,280 వద్ద ఉంది. దీనికి ముందు కూడా వరుసగా రూ. 660, రూ. 2240, రూ. 1030, రూ. 1530, రూ. 1090 మేర తగ్గింది. ఈ క్రమంలో వారంలోనే రూ. 12 వేల వరకు తగ్గింది. 22 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే ఇవాళ రూ. 6550 తగ్గడంతో తులం రేటు రూ. 1,37,750 వద్ద కొనసాగుతోంది. రూ. 10 వేలు తగ్గిన సిల్వర్..గోల్డ్ రేట్ల బాటలోనే సిల్వర్ ధర కూడా దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజే ఇది రూ. 10 వేలు తగ్గడంతో కేజీకి హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ. 2.65 లక్షలకు దిగొచ్చింది. ముందటి రోజు కూడా రూ. 5 వేలు తగ్గింది. వారంలోనే రూ. 30 వేలకుపైగా పడిపోయింది.ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ పతనం..ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగొచ్చాయి. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,850 డాలర్లకుపైన ఉండగా.. మార్చి 19న రాత్రి ఒక దశలో ఇది 4,500 డాలర్ల స్థాయికి కూడా దిగొచ్చింది. ఇప్పుడు 4,700 డాలర్ల దిగువన ఉంది. సిల్వర్ రేటు ఒక దశలో 70 డాలర్ల మార్కు దిగువకు చేరింది. ప్రస్తుతం రూ. 74 డాలర్ల వద్ద ఉంది.