ఖమ్మం రోడ్లకు మహర్దశ.. 5 కీలక రహదారుల విస్తరణ, రూ.594 కోట్లు మంజూరు

Wait 5 sec.

ఖమ్మం జిల్లా రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని ఐదు ప్రధాన మార్గాల్లో సుమారు 100.82 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ కోసం రూ.594 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రదారుల విస్తరణ ప్రాజెక్టును పద్ధతిలో చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ భారీ రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధి వల్ల ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి పొరుగు రాష్ట్రాల సరిహద్దుల వరకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం లభించనుందని అన్నారు. రహదారుల విస్తరణ ఈ మార్గాల్లోనే.. మధిర నుంచి జిలుగుమాడు, ఆత్కూరు, కిష్టాపురం, సిరిపురం, కలకోట మీదుగా తూటికుంట్ల వరకు మొత్తం 13.50 కిలోమీటర్ల మేర రహదారిని 4 వరుసల రహదారిని రూ.81 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు.వైరా నుంచి జగ్గయ్యపేట వరకు హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవేను కలుపుతూ రూ.151.20 కోట్ల నిధులను కేటాయించారు.ఖమ్మం నుంచి కొత్తూరు, దంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్‌ వరకు రూ.157.23 కోట్లతో 28.03 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తారు.మధిర నుంచి ఎల్లెందులపాడు, దెందుకూరు, మీనవోలు మీదుగా ఎర్రుపాలెం వరకు 18.40 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారి పనులను రూ.110.40 కోట్లతో చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.బోనకల్‌ నుంచి ఆళ్లపాడు, రాయన్నపేట మీదుగా వంగవీడు వరకు మొత్తం 15.72 కిలోమీటర్ల మేర రూ.94.32 కోట్లతో నాలుగు వరుసలుగా తీర్చిదిద్దనున్నారు.ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారులను విస్తరించటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడం ఈడీ అవుతుందని, ప్రమాదాల రహిత ప్రయాణానికి వీలుంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముగించి, పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.