: దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫ్రాన్స్‌కు చెందిన అముండి జాయింట్ వెంచర్ అయిన ఈ ఎస్బీఐ ఫండ్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు రాబోతుంది. ఎప్పటినుంచో వార్తలు వచ్చినా ఇప్పుడు అధికారికంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) దగ్గర డ్రాఫ్ట్ పేపర్స్‌ను (DRHP) గురువారం దాఖలు చేసింది. సెబీ ఆమోదంతో తర్వాత ఇష్యూ ప్రైస్, సబ్‌స్క్రిప్షన్, అలాట్‌మెంట్, లిస్టింగ్ తేదీల్ని కూడా ప్రకటించనుంది. ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చెప్పొచ్చు. షేర్ల విక్రయం ద్వారా సుమారు రూ. 13,500 కోట్ల మేర నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ కోసం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మాతృసంస్థలుగా ఉన్న ఎస్బీఐ సుమారు 6.3 శాతం, అముండి (ఫ్రాన్స్) 3.7 శాతం మేర వాటాల్ని విక్రయించనున్నాయి. మొత్తంగా 10 శాతం వాటాను విక్రయంచడం ద్వారా రూ. 13,500 కోట్లు సమీకరించనున్నాయి. గతేడాదే ఈ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓకు బోర్డు ఆమోదం లభించినప్పటికీ.. . ఆలోపే ఐపీఓ ప్రాసెస్ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, జేఎం ఫైనాన్షియల్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ, జెఫరీస్ వంటి మొత్తం 9 బ్యాంకులు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌లో ఎస్బీఐ వాటా మొత్తంగా 61.98 శాతంగా ఉండగా.. ఇదే మెజారిటీ షేర్ హోల్డర్‌గా ఉంది. అముండీకి 36.40 శాతం వాటా ఉంది. ఇందులో భాగంగానే ఎస్బీఐ సుమారు తన వాటాలో 6.3 శాతం వాటాకు సమానమైన 12.83 కోట్ల మేర షేర్లను విక్రయిస్తుండగా.. అముండీ 3.7 శాతం వాటాకు సమానమైన 7.53 కోట్ల మేర షేర్లను విక్రయిస్తోంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే దీని నిర్వహణలోని ఆస్తుల విలువ (AUM) సుమారు రూ. 12.50 లక్షల కోట్లుగా ఉండగా.. ఇదే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC). మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో దీని వాటానే 15.4 శాతం వరకు ఉంది. FY25 కు సంబంధించి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నికర లాభం రూ. 2,531 కోట్లుగా ఉంది.