హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు.. గచ్చిబౌలి సహా ఆ 2 ప్రాంతాల్లోనే హైడిమాండ్.. ఒక్క ఫ్లాట్ రూ.8.90 కోట్లు!

Wait 5 sec.

: హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో సొంతిల్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారి సంఖ్యా పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్ ప్రాంతంలో పెరిగాయి. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపాదికన చూసుకుంటే రెండు శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది 2026, జనవరి నెలలో 4686 యూనిట్లతో పోలిస్తే ఫిబ్రవరి నెల రిజిస్ట్రేషన్లు 32 శాతం పెరిగినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఇళ్ల ట్రాన్సాభన్లు ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో జరుగుతుంటాయి. కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల్లో నేరుగా బిల్డర్ నుంచి కొనే మార్కెట్‌ను ప్రైమరీగా పరిగణిస్తారు. ఈ నివాసాలను తిరిగి అమ్మతే ఒక యజమాని నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేస్తారు. దీన్ని సెకండరీ మార్కెట్ గా గుర్తిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలతో పాటుగా సంగారెడ్డి జిల్లాలోని కొంత భాగం కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేటే పరిధిలోకి వస్తుంది. ఫిబ్రవరి నెలలో మొత్తం 28 రోజులో అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు నివేదిక పేర్కొంది. రూ.కోటిపైన వాటికి గిరాకీ గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగాయి. సగటు చదరపు అడుగు విలువ ఏడాది కాలంలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 3 శాతం, రంగారెడ్డి జిల్లాలో 6 శాతం, సంగారెడ్డి జిల్లాలో 7 శాతం మేర ధరలు పెరిగాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల సగటు చదరపు అడుగు రూ.4457 గా ఉంది. ఫిబ్రవరి నెలలో రూ.4139 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరిగితే వాటిలో కోటి రూపాయలపై విలువ కలిగిన ఇళ్ల విలువే 48 శాతంగా ఉంది. అధిక విలువ ఉన్న నివాస లావాదేవీలు ఐటీ కేంద్రంగానే అధికంగా జరిగాయి. అత్యధికంగా 3 వేల చదరపు అడుగుల కంటే అధిక వైశాల్యం కలిగినవి ఉన్నాయి. విలువ పరంగా మొదటి నాలుగు ట్రాన్సాన్లు గమనిస్తే నార్సింగిలో ఒక్కో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విలువ రూ.8.90 కోట్లు నమోదైంది. ఆ తర్వాత గచ్చిబౌలిలో రూ.7.93 కోట్లు, రాయదుర్గంలో రూ.6.54 కోట్లు, షేక్ పేట్‌లో రూ.6.34 కోట్లతో ఒక్కో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగింది. నెలల వారీగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో జనవరిలో 2025లో 5464 రిజిస్ట్రేషన్లు జరగగా 2026లో 4686 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇక ఫిబ్రవరి నెలలో 2025లో 5988 యూనిట్లు రిజిస్టర్ కాగా అది ఫిబ్రవరి నెలలో 6179గా నమోదైంది. విస్తీర్ణం పరంగా చూసుకుంటే 500 చదరపు అడుగు లోపు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు 3 శాతం పెరిగాయి, 501-1000 చ.అ.లోపు ఇళ్లు 15 శాతం, 1001-2000లోపు ఇళ్లు 66 శాతం, 2001-3000 చ.అ.లోపు ఇళ్లు 13 శాతం, 3000 పైన ఇళ్లకు 3 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ నెలలో 14 శాతం, మేడ్చల్-మల్కాజిగిరిలో 45 శాతం, రంగారెడ్డిలో 41 శాతం ఇళ్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.