బీబీ జోడీ సీజన్ 2 ప్రస్తుతం సెమీ ఫైనల్ దశలోనే ఉంది. అయితే ఫినాలే షూటింగ్ కూడా ఇప్పటికే ముగిసిందని.. లీక్ కూడా అయింది. తాజాగా వదిలిన సెమీ ఫినాలే ప్రోమోలో శ్రీసత్య-అర్జున్ కళ్యాణ్, అమర్-నైనిక పెర్ఫామెన్స్‌లు చూపించారు. ముఖ్యంగా అమర్-నైనిక స్టేజ్ మీద మిర్రర్స్ పెట్టి చేసిన పెర్ఫామెన్స్ బావుంది. ఇది కొత్తగా ఉందని శేఖర్ మాస్టర్ సహా జడ్జీలు మెచ్చుకున్నారు.సెమీస్‌కి వచ్చినా మారరా?ఇక వీళ్ల పెర్ఫామెన్స్‌కి పింకీ ఆరుకి ఆరు మార్కులు ఇచ్చేసింది. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది అన్నా.. బాయ్స్ మిమ్మల్ని ఎత్తుకున్న దగ్గరా అక్కడక్కడా చిన్న చిన్న ఫంబుల్స్ ఉన్నాయ్.. అంటూ చెప్పింది. దీంతో పింకీ నువ్వు నెగెటివ్ కామెంట్స్ చెప్తున్నావ్.. మళ్లీ 6 ఇచ్చావ్.. అవి ఎలా ఇచ్చావ్ నాకు అర్థం కాలేదు.. అంటూ శేఖర్ మాస్టర్ కొశ్చన్ చేశారు. అమర్ వాళ్ల దగ్గర బ్రహ్మాస్త్ర ఉంది అందుకనే సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారా.. అని అడిగారు.మీరు నెగెటివ్ చెప్తున్నారంటే అది స్కోరింగ్‌లో డిఫెరెన్స్ తెలియాలి కదా..సెమీ ఫినాలే ఇది.. ఇలా చేస్తే కరెక్ట్ కాదు.. అంటూ శ్రీదేవి విజయ్‌కుమార్ అన్నారు. ఇక చివరిలో డేంజర్ జోన్‌లో ఉన్న ధన్‌రాజ్-భానుశ్రీ, పింకీ-మణికంఠ జోడీలని స్టేజ్ మీదకి పిలిచారు. అమర్‌దీప్-నైనిక మీ దగ్గర బ్రహ్మాస్త్ర ఉంది.. దీంతో ఈ రెండు జోడీల్లో ఒక జోడీని మీరు ఎలిమినేట్ కాకుండా కాపాడొచ్చని ప్రదీప్ చెప్పగానే అమర్-నైనిక ఆలోచించుకున్నారు. మరి ఈ రెండు జోడీల్లో ఎవరిని కాపాడారో చూడాలి మరి.ఇక సెమీ ఫినాలేకి మానస్-శ్రష్టి చేసిన పెర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది. శివుడి పాటకి ఇద్దరూ చేసిన డ్యాన్స్ చూసి శేఖర్ మాస్టర్ సహా జడ్జీలు ఫిదా అయిపోయారు. షో మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఆల్ మోస్ట్ ప్రతి పెర్ఫామెన్స్‌ని ప్రాణం పెట్టి చేశారు ఈ జోడీ. ముఖ్యంగా కొరియోగ్రాఫర్ అయిన శ్రష్టి.. మంచి డ్యాన్సర్ అయిన మానస్ ఇద్దరూ జోడీ కావడంతో పెర్ఫామెన్స్‌ల్లో వీళ్ల డామినేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది.వీళ్లకి నేహా-విశ్వ, అమర్‌దీప్- నైనిక నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. అయితే అమర్-నైనిక జోడీ అప్పుడప్పుడూ హిట్ పెర్ఫామెన్స్ ఇస్తున్నా ఒక్కోసారి ఫెయిల్ అవుతున్నారు. ఇక నేహా-విశ్వ కూడా కన్సిస్టెంట్‌గా మంచి పెర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఈసారి మానస్-శ్రష్టి టైటిల్ గెలవగా.. నేహా-విశ్వ రన్నరప్ అయినట్లుగా తెలిసింది. ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వడానికి మరో వారం ఆగాల్సిందే.