రూ.10 లక్షల లోన్ తీసుకుంటే.. SBI, BoB సహా ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ.. EMI ఎంత కట్టాలి?

Wait 5 sec.

Personal Loan: ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వ్యక్తిగత రుణాలకు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. లోన్ ప్రాసెసింగ్ సైతం సులభం, ఎలాంటి తనఖా అవసరం లేకుండా ఉంటుంది కాబట్టి చాలా మంది రుణాలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే, లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువగా ఉంది? నెలవారీ బకాయి ఈఎంఐ ఎంత పడుతుంది అని లెక్కించుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం పోటీ పడి వడ్డీ తక్కువ రేట్లకే రుణాలు అందిస్తున్నాయి. వీటిల్లో రూ. 10 లక్షల వ్యక్తిగత రుణాన్ని 5 సంవత్సరాల కాలపరిమితితో తీసుకుంటే ఆ మూడు బ్యాంకుల మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు తెలుసుకుందాం.8.75 శాతం వడ్డీ5 ఏళ్ల కాలపరిమితితో రూ.10 లక్షల పర్సనల్ లోన్ తీసుకోవాలనుకోవాలంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఈ బ్యాంకులో ప్రస్తుతం వ్యక్తిగత రుణ వడ్డీ రేటు 8.75 శాతంతో ప్రారంభమవుతోంది. దీని ప్రకారం చూసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.20,637 అవుతుంది. మొత్తంగా వడ్డీ భారం రూ.2,38,234 గా ఉంటుంది.ఎస్‌బీఐలో వడ్డీ రేట్లుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 10.05 శాతం వరకు ఉన్నాయి. దీని ప్రకారం 5 ఏళ్ల కాలానికి రూ.10లక్షల లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.21,272 అవుతుంది. మొత్తం వడ్డీ రూ.2,76,299 వరకు అవుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలోని ప్రకారం రూ. 10 లక్షలు 60 నెలల కోసం తీసుకుంటే అప్పుడు నెలకు రూ.21,321 ఈఎంఐ వసూలు చేస్తోంది. మొత్తం వడ్డీ భారం రూ.2,79,256 ఉంది.ఎందులో తక్కువ?బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో లోన్ తీసుకోవడం ద్వారా స్టేట్ బ్యాంకుతో పోలిస్తే సుమారు రూ.38 వేల వడ్డీ ఆదా అవుతుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాతో పోలిస్తే దాదాపు రూ.41 వేల వరకు వడ్డీ ఆదా అవుతుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అత్యంత తక్కువ వడ్డీ 8.75 శాతంతోనే లోన్ ఇస్తోంది. ఎస్‌బీఐతో పోలిస్తే మీరు నెలకు సుమారు రూ. 635, మొత్తం వడ్డీలో రూ. 38 వేలు సులభంగా ఆదా చేసుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ 10.05 శాతం నుంచి వడ్డీ మొదలవుతోంది. 800 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే ఈ రేట్లకే లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.