క్రూడాయిల్ భారీగా తగ్గినా.. ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ.. మళ్లీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

Wait 5 sec.

: భారత స్టాక్ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల కళ కనిపిస్తోంది. .. కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఇవాళ పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మార్చి 20న ఉదయం 10 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 800 పాయింట్ల లాభంతో 75 వేల స్థాయిలో ఉంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 250 పాయింట్లు పుంజుకొని 23,250 స్థాయిలో కదలాడుతోంది. ఇక్కడ పలు హెవీ వెయిట్ స్టాక్స్ నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సహా పలు ఐటీ స్టాక్స్, ఫార్మా స్టాక్స్ 2 శాతానికిపైగా పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లకు కూడా లాభాలు వస్తున్నాయి.ఇదిలా ఉన్నప్పటికీ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మాత్రం రోజురోజుకూ పడిపోతోంది. మార్చి 20న ఉదయం మరింత క్షీణించి 93 మార్కు దాటింది. ప్రస్తుతం డాలరుతో చూస్తే రూ. 93.16 వద్ద ఉంది. చరిత్రలో తొలిసారిగా రూపాయి విలువ ఈ స్థాయికి దిగజారింది. అంతర్జాతీయంగా ఇరాన్- ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం కావడం ఇందుకు కారణం. ఇక్కడ ప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయాలు రూపాయి విలువ పడిపోయేందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతనానికి ప్రధాన కారణాలు..అంతర్జాతీయంగా యుద్ధ భయాలతో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం ఒకటి. దీని కారణంగా కొనుగోలు శక్తి తగ్గి కరెన్సీ విలువ తగ్గుతుంది. ఇంకా అమెరికన్ డాలర్ విలువ పుంజుకోవడంతో రూపాయి వంటి ఇతర కరెన్సీల విలువ తగ్గుతోంది. ప్రస్తుత అనిశ్చితి వేళ విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్ మార్కెట్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. . యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడాయిల్ ధర 70 డాలర్ల దిగువన ఉండగా.. మార్చి 19న ఒక దశలో 118 డాలర్ల వద్ద గరిష్ఠాల్ని తాకింది. చమురు విషయంలో భారత్ మెజార్టీ భాగం దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి.. ఈ ధరలు పెరుగుతుంటే డాలర్లలో చెల్లించాలి కాబట్టి.. దిగుమతుల బిల్లు భారంగా మారి రూపాయి విలువను తగ్గిస్తుంటుంది. ఎట్టకేలకు తగ్గిన క్రూడాయిల్ ధర..ముడి చమురు ధరలు మార్చి 19న ఒక దశలో భారీగా పెరగ్గా.. గరిష్ఠాల నుంచి భారీగానే దిగొచ్చాయి. కిందటి రోజు బ్యారెల్ క్రూడాయిల్ రేటు 118 డాలర్ల వద్ద గరిష్ఠాన్ని చేరగా.. ఇప్పుడు అది 102 డాలర్ల దిగువకు చేరింది. 15 శాతం వరకు తగ్గిందని చెప్పొచ్చు. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ వంటివి ఆంక్షల ప్రభావాన్ని కాస్త తగ్గించినట్లు తెలుస్తోంది. మరోవైపు వార్తలు కూడా ధరలు తగ్గేందుకు కారణంగా నిలిచింది. ఈ క్రమంలోనే కిందటి రోజు భారీగా పతనమైన కూడా ఇవాళ పుంజుకుంటున్నాయి.