హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. ఏఐ టెక్నాలజీతో ఉత్తరభాగం పనులు

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం ను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. సగం తెలంగాణ జిల్లాలను కవర్ చేస్తూ సూపర్ గేమ్ ఛేంజర్‌గా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా ఈ రహదారిని నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఉత్తర భాగం పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కేంద్రం జాతీయ నంబర్‌ను కూడా కేటాయించి పనుల కోసం టెండర్లు ఆహ్వానించింది. ఇక వచ్చింది. ఏఐ టెక్నాలజీతో ఈ భాగం పనులు చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించిన యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు ఏఐ ఆధారిత అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. ఈ క్రమంలో తెలంగాణలో ప్రారంభించనున్న కొత్త ఎన్‌హెచ్‌ఏఐ రహదారులకు ఇదే తరహా టెక్నాలజీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం పనుల్లో ఈ టెక్నాలజీ వినియోగించడంపై కేంద్రం ఫోకస్ సారించింది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడ్‌పల్లి వరకు 161.5 కిలోమీటర్ల ఆరు వరుసలతో ఈ రహదారి నిర్మిస్తున్నారు. ఈ రహదారి వెంట ఏఐ ఆధారిత సాంకేతికతను వినియోగించడానికి ఎన్‌హెచ్‌ఏఐ తాజాగా ఏర్పాట్లు చేస్తోంది. దాంతో పాటుగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని 4నుంచి 6 వరుసలుగా మార్చడానికి ఇప్పటికే డీపీఆర్ సమర్పించారు. ఇందులో మొత్తం 232 కిలోమీటర్ల పొడవున సాంకేతికతను ఉపయోగించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా అడ్వాన్స్డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా తెలంగాణ, ఏపీలోని పోలీసు, రవాణా శాఖలతో రోడ్డు భద్రతను అనుసంధానం చేస్తారు. హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ మార్గంలోనూ కొత్త టెక్నాలజీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ పరిధిలో ఈ రహదారి మొత్తం 251 కిలోమీటర్ల మేర ఉండగా పూర్తిస్థాయిలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం తీసుకురానున్నారు. ఈ ఏఐ టెక్నాలజీలో భాగంగా రహదారి వెంట అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేస్తారు. ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా మితిమీరిన వేగంతో వాహనాలు వెళ్తే ఈ కెమెరాలు పట్టేస్తాయి. వెంటనే ఆ వాహనదారుడి అడ్రస్‌కు ఆటోమెటిక్‌గా చలాన్లు వెళ్తాయి. దాంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే అలర్ట్ కావటానికి వైద్య సహాయం అందించటానికి వీలు కలుగుతుంది.