Diesel Price: మరో షాక్.. ఇండస్ట్రీయల్ డీజిల్ ధర పెంపు.. ఒక్కో లీటరుకు రూ.22 బాదుడు

Wait 5 sec.

Diesel Price: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం సామాన్యుల నుంచి పరిశ్రమల వరకు తాకుతోంది. ఇంధన దిగుమతులపై భారత్ అత్యధికంగా ఆధారపడడమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 115 డాలర్లు దాటేసింది. మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ధరల భారాన్ని తగ్గించుకునేందుకు దేశీయ ఆయిల్ . కొద్ది రోజుల కిందటే వంట్ గ్యాస్ ధరలను పెంచిన ఆయిల్ కంపెనీలు శుక్రవారం రోజున పవర్ పెట్రోల్ ధరలు రూ.2 పైన పెంచాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇండస్ట్రీయల్ డీజిల్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటన చేశాయి. ఈ డీజిల్ ధరలను అమాంతం పెంచేశాయి. లీటరుకు ఏకంగా రూ.22 వరకు పెంచడం గమనార్హం. దేశీయ పారిశ్రామిక రంగానికి షాక్ ఇస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండస్ట్రీయల్ డీజిల్ ధరను పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) బల్క్ డీజిల్ ధరను లీటరుకు రూ.22 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు లీటర్ డీజిల్ ధర రూ.87.57 స్థాయిలో ఉండగా అది ఇప్పుడు రూ.109.59 స్థాయికి ఎగబాకింది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ ధరలపై ప్రస్తుతం ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే, నేరుగా ఆయిల్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసే పారిశ్రామిక వినియోగదారులపై ఈ భారం పడనుంది. సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాలను నడిపించే పరిశ్రమలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. లీటరుకు రూ.22 పెంపుతో వారి ఉత్పత్తి వ్యయం ఒక్కసారిగా పెరగనుంది. నేరుగా ఆయిల్ కంపెనీల నుంచి డీజిల్ కొనుగోలు చేసే రైల్వే, రాష్ట్ర రావాణా సంస్థలు, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్లు అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపుతో రవాణా ఛార్జీలను పెంచే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేందుకు దారితీస్తుందని, అది సామాన్య ప్రజల జేబుపై ప్రభావం చూపిస్తుందంటున్నారు.