తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన ఇప్పటికే ఈ కేసులో 11 మందికి డ్రగ్స్ టెస్ట్‌లు చేయగా.. వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను మాత్రమే అరెస్ట్ చేశారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డితోపాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి.. ఢిల్లీకి చెందిన బిజినెస్‌మెన్ నమిత్ శర్మలను పోలీసులు అదే రోజు అరెస్ట్ చేసి.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని తాజాగా పోలీసులు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఈ మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పైలట్ రోహిత్‌ రెడ్డి, రితేష్‌ రెడ్డి, నమిత్ శర్మలను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ముగ్గురు నిందితులను.. పోలీసులు 3 రోజుల పాటు విచారణ చేయనున్నారు. వీరిని విచారించడం ద్వారా డ్రగ్స్ నెట్‌వర్క్ మూలాలు ఎక్కడ ఉన్నాయి.. డ్రగ్స్ సరఫరాదారుల వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఈ ముగ్గురు నిందితులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని.. రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ డ్రగ్స్ పార్టీ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు.. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు.. వారి ప్రమేయం ఏంటి అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేయనున్నారు.ఈనెల 14వ తేదీన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని వచ్చిన పక్కా సమాచారంతో మొయినాబాద్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో డ్రగ్స్‌తో పాటు పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ దాడుల సమయంలో పోలీసులు, అధికారులపైకి నమిత్ శర్మ కాల్పులు జరపడం పెను సంచలనంగా మారింది. ఆదేశాలతోనే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.