తిరుపతి: రైలు పట్టాలపై నవ వరుడి మృతదేహం, స్నేహితుడితో కలిసి.. అసలేమైంది?

Wait 5 sec.

తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి జరిగి నెలన్నర రోజులు కూడా పూర్తి కాకముందే నవ వరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితుడితో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తడ మండలంలోని కొండూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇద్దరు స్నేహితులు ఒకేరోజు, ఒకేచోట ఇలా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కూడా పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. వీరి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చనిపోయిన వారిని సూళ్లూరుపేట మండలం పేర్నాడుకు చెందిన సునీల్ (25), పిండిపాలెనికి చెందిన కళ్యాణ్ (24)గా పోలీసులు గుర్తించారు. కళ్యాణ్‌కు నెలన్నర రోజుల కిందటే పెళ్లి జరిగింది. వివాహమైన నెలన్నరకే కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. యువకుల మృతితో పేర్నాడు, పిండిపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.'కొత్తకోట వంతెనపై ప్రమాదంమరోవైపు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వెళ్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురైన ఘటన పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది.డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ఆ కుటుంబం వెళ్తున్న కారు.. పి.కొత్తకోట వంతెనపైముందు వెళుతున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో సతీష్‌(50) అనే వ్యక్తి, అతని భార్య భాగ్యలక్ష్మి(45) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మాండ్యకు చెందిన సతీష్‌ అనే వ్యక్తి తన భార్య, నలుగురు పిల్లలు, డ్రైవర్‌ ప్రదీప్‌తో కలిసి శనివారం రాత్రి తిరుపతికి బయల్దేరారు.అయితే వారు ప్రయాణిస్తున్న కారు.. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా చిత్తూరు-తిరుపతి హైవేపై పి.కొత్తకోట వంతెన వద్ద ముందు వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ పక్క సీటులో ఉన్న సతీష్, వెనుక సీటులోని భాగ్యలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి పిల్లలు నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోయి నలుగురు పిల్లలు అనాథలుగా మారటం చూపరులను కంటతడి పెట్టిస్తోంది.