కస్టమర్లకు ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. కేవైసీ చేయకుంటే ఈ అకౌంట్లు క్లోజ్.. నెల రోజులే ఛాన్స్!

Wait 5 sec.

: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన (PNB) కీలక ప్రకటన చేసింది. ఇన్‌ఆపరేటివ్ అకౌంట్లు ఉన్న అకౌంట్ హోల్డర్స్.. నో యువర్ కస్టమర్ (కస్టమర్ గురించి తెలుసుకో- kyc) ప్రాసెస్ త్వరగా పూర్తి చేసుకోవాలని.. తిరిగి తమ ఖాతాల్ని పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేసింది. లేకపోతే నెల రోజుల్లోనే సదరు ఖాతాల్ని మూసివేయనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 2026, ఏప్రిల్ 15 లోగా.. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని.. ఇన్‌ఆపరేటివ్ అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలని సూచించింది. ఆలోపు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయకపోతే.. కస్టమర్లకు ఎలాంటి సమాచారం అందించకుండానే ఆ ఖాతాల్ని మూసివేస్తామని స్పష్టం చేసింది. అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించలేరని చెప్పొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌కు సంబంధించి కస్టమర్లు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నిర్వహించకపోతే అవి ఇన్‌ఆపరేటివ్ ఖాతాలుగా మారతాయి. ఇలాంటి ఖాతాల్నే ఇప్పుడు పునరుద్ధరించుకునేందుకు కేవైసీ చేసుకోవాలని బ్యాంక్ పేర్కొంది. కేవైసీ అంటే ఇక్కడ కస్టమర్ తన ప్రాథమిక డేటాను అప్డేట్ చేయడమే. మీ గుర్తింపు కార్డు సహా (ఆధార్, పాన్ వంటివి) ఇతర ప్రాథమిక వివరాల్ని తీసుకెళ్లి బ్యాంకుకు సమర్పిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో కూడా కేవైసీ ప్రాసెస్ చేసుకునేందుకు బ్యాంకులు వీలు కల్పిస్తున్నాయి. సాధారణంగా ఈ రోజుల్లో చాలా మంది ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లను తెరవాల్సి వస్తుంది. ఇక్కడ తమ తమ అవసరాల దృష్ట్యా కావొచ్చు.. ఇతర కారణాల వల్ల కావొచ్చు. ఇంట్లో కనీసం 4-5 బ్యాంక్ ఖాతాలైనా ఉంటున్నాయి. విద్యార్థుల దగ్గర నుంచి గృహిణులు, ఉద్యోగులు, రైతులు, వృద్ధులు ఇలా అందరికీ బ్యాంక్ అకౌంట్ అవసరం పడుతుంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలన్నా దాని కోసం బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగం మారుతున్న కొద్దీ.. ఉద్యోగులు కొత్త కొత్త అకౌంట్లను తెరుస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే పలు బ్యాంక్ అకౌంట్లను మెయింటెయిన్ చేయలేక కొన్నింటిని పూర్తిగా పక్కనబెట్టేస్తారు. వీటిల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. దీంతో చాలా కాలంగా ట్రాన్సాక్షన్స్ నిర్వహించకపోతే అవి ఇన్‌ఆపరేటివ్‌గా మారి.. కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే బ్యాంకులు క్లోజ్ చేస్తుంటాయి. దీనికి ముందు కొన్ని సార్లు కస్టమర్లకు కాల్స్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా బ్యాంకులు గుర్తుచేస్తుంటాయి. నిర్ణీత కాలం గడిస్తే.. వాటిని క్లోజ్ చేస్తుంటాయి.