పాకిస్తాన్ సూపర్ లీగ్‌కు వెళ్లొద్దు.. ఆస్ట్రేలియా ప్లేయర్లకు హెచ్చరిక

Wait 5 sec.

అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన భారీ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో (పీఎస్ఎల్) 2026 భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ దాడిలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన క్రికెట్ ప్రపంచానికీ ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కీలక హెచ్చరిక జారీ అయింది. పాకిస్తాన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ, పెషావర్‌ నగరానికి మాత్రం వెళ్లొద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాంతాన్ని ప్రయాణ రహిత జోన్‌గా ప్రకటించింది.2026 పీఎస్ఎల్ మార్చి 26న ప్రారంభం కానుండగా, రెండు రోజుల తర్వాత ఐపీఎల్ కూడా మొదలవుతుంది. ఈ సీజన్‌లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. అయితే పేషావర్‌లో జరిగే మ్యాచ్‌లపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. మార్చి 28న పెషావర్ - రావల్పిండి జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ప్రాతినిధ్యం వహించనున్నారు.జల్మీ తరఫున ఆరోన్ హర్డీ ఆడుతుండగా, రవల్పిండి జట్టుకు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఎంపికయ్యాడు. కానీ భద్రతా ఆందోళనలతో ఈ మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అవసరమైతే ప్రైవేట్ విమానాల ద్వారా వెంటనే తరలించే ఏర్పాట్లు కూడా చేశామని నివేదికలు వెల్లడించాయి.మరోవైపు, అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు కూడా పీఎస్ఎల్ వేలం నుంచి తప్పుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ముజీబ్ అర్ రెహ్మాన్, మొహమ్మద్ నబీ, ఫజల్ హక్ ఫరూఖీ వంటి ఆటగాళ్లు మొదట రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, తర్వాత తమ పేర్లు ఉపసంహరించుకున్నారు. దీనికి కారణం రహ్మానుల్లా గుర్బాజ్‌ను పెషావర్ జల్మీ నేరుగా సైన్ చేయడం పై వచ్చిన వ్యతిరేకతగా తెలుస్తోంది.మొత్తంగా చూస్తే, అప్ఘనిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, క్రికెట్ లీగ్‌లపై కూడా తీవ్రంగా పడుతోంది. విదేశీ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో పాల్గొంటారా? పీఎస్ఎల్ షెడ్యూల్ మారుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.