చీపెస్ట్ హోం లోన్స్.. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా దేంట్లో వడ్డీ రేట్లు ఎలా.. ఈ బ్యాంకుల్లో 7.10 శాతం నుంచే ప్రారంభం!

Wait 5 sec.

: మనకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎన్నో రకాల లోన్లు ఆఫర్ చేస్తుంటాయి. వీటిల్లో పర్సనల్ లోన్స్, హోం లోన్స్, వెహకిల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, గోల్డ్ లోన్స్ వంటివి ఉంటాయి. ఎక్కువ మొత్తంలో మాత్రం హోం లోన్స్ తీసుకుంటుంటారు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా.. కొనాలన్నా పెద్ద ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఇక్కడ తనఖా పెడతాం కాబట్టి.. వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. వీటిని సెక్యుర్డ్ లోన్స్‌గా వ్యవహరిస్తుంటారు. కూడా భారీగా దిగొచ్చాయి. దీంతో చాలా మంది ఈ ప్రయోజనం పొందారు. హోం లోన్ అనేది ఎక్కువ టెన్యూర్‌తో ఉంటుంది కాబట్టి.. వడ్డీ రేటు కాస్త తగ్గినా.. పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. ఇది ఈఎంఐని.. చెల్లించాల్సిన మొత్తం వడ్డీని తగ్గిస్తుంది. అందుకే తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులో హోం లోన్ తీసుకోవడం ఉత్తమం.ఇప్పుడు దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ హోం లోన్స్ వడ్డీ రేట్లు రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు, లోన్ టు వాల్యూ రేషియో, ఆదాయం, కాల పరిమితి, పాలసీ రేట్లు వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. స్థిర ఆదాయం ఉండి.. మెరుగైన సిబిల్ స్కోరు ఉన్నట్లయితే కనీస or ప్రారంభ వడ్డీ రేటుకే లోన్లు పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే.. . బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేట్లు 7.10- 10.25 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చూస్తే 7.10-9.90 శాతంగా ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా 7.10 శాతం నుంచే ప్రారంభమవుతున్నాయి. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.25 శాతం నుంచి 8.70 శాతం మధ్య ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 7.20 శాతం నుంచి 9 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 7.20-9.25 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయానికి వస్తే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీలో ప్రస్తుతం హోం లోన్ వడ్డీ రేట్లు 7.75 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకులో 7.45 శాతం నుంచే ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకులో 7.70 శాతం నుంచి మొదలవుతున్నాయి. యాక్సిస్ బ్యాంకులో 8 శాతం నుంచి 9.10 శాతం వరకు ఉన్నాయి. ఫెడరల్ బ్యాంకులో 7.30 శాతం నుంచి 9.75 శాతంగా ఉన్నాయి.