లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఫాంహౌస్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందినదనే విషయం తెలిసిన సంగతే. తాజాగా ఫాంహౌస్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీకి హాజరైనవారి వాహనాలను కూడా సీజ్ చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్‌ను అసైన్డ్ భూమిలో నిర్మించినట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ ఫాంహౌస్‌ను సంయుక్తంగా సీజ్ చేసినట్లు తెలిసింది. కీలక మలుపు తిరిగిన కేసుమరోవైపురేపింది. ఇటు, అటు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అరెస్ట్ కావటం సంచలనం రేపింది. అయితే స్టేషన్ బెయిల్ మంజూరు కావటంతో పుట్టా మహేష్ విడుదలయ్యారు. పైలెట్ రోహిత్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. ఈ క్రమంలోనే సిట్ దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన అభిషేక్ సింగ్.. డ్రగ్స్ చేరవేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.మొయినాబాద్ ఫాంహౌస్ కేసు నిందితుల్లో ఒకరైన కౌశిక్‌ రవి ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో అభిషేక్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీకి.. అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలిసింది. అభిషేక్ సింగ్ వద్ద నుంచి హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. తాజాగా డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో.. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ సింగ్ కాల్ డేటాను సైతం సిట్ బృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.