అదిరిపోయే శుభవార్త.. 3 రోజుల్లో రూ. 10,500 తగ్గిన బంగారం ధర.. ఏ జువెల్లరీల్లో గోల్డ్ రేట్లు ఎలా?

Wait 5 sec.

22k : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రంగానే ఉన్నప్పటికీ.. బంగారం ధరలు రోజురోజుకూ పడిపోతూనే ఉన్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా.. పరస్పరం దాడులు, ప్రతిదాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ ఈ దేశాలతో సహా సమీపంలోనే గల్ఫ్ దేశాలపైనా దాడులు చేస్తోంది. దీంతో హార్ముజ్ జలసంధి దగ్గర చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు మరింత ఆకర్షిస్తుంటాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలుగా మారుతుంటాయి. దీంతో ధర కూడా పెరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. . రోజురోజుకూ భారీగా పడిపోతోంది. యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా.. ఆ రోజు సహా మార్చి 1న ధర పెరిగింది. మళ్లీ అక్కడి నుంచి ధర భారీగా పతనమైంది. మధ్యలో 2-3 రోజులు మాత్రమే పెరిగిందని చెప్పొచ్చు. మిగతా రోజుల్లో భారీగా దిగొచ్చింది. ఈ క్రమంలోనే కొనుగోలుదారులు పండగ చేసుకుంటున్నారు. ఏ జువెల్లరీల్లో రేట్లు ఇలా..మార్చి 21న ఉదయం 10 గంటల తర్వాత గోల్డ్ రేట్లు మళ్లీ పతనమయ్యాయి. 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 2750 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ 2940 తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం లలితా జువెల్లరీలో గ్రాము పసిడి ధర (22 క్యారెట్లు) రూ. 13,380 వద్ద ఉంది. ఇక తనిష్క్ జువెల్లరీలో చూస్తే రూ. 13,420 వద్ద కొనసాగుతోంది. ఇక మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఖజానా, జోయాలుక్కాస్ వంటి వాటిల్లోనూ గ్రాము గోల్డ్ రేటు రూ. 13,380 వద్దే ఉంది. ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) ధరలు చూస్తే 22 క్యారెట్ల ధర రూ. 13,485 వద్ద ఉండగా... 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 14,722 వద్ద కొనసాగుతోంది. డాలర్ పెరుగుతుండటం.. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం.. ప్రాఫిట్ బుకింగ్ వంటివి బంగారం ధర దిగొచ్చేందుకు కారణాలుగా ఉన్నాయి.