ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. యుద్ధం మొదలైన తర్వాత రెండోసారి

Wait 5 sec.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్‌కు శనివారం ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనకు ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపిన మోదీ... ఈ సందర్భంగా ఇరాన్ మౌలిక స్థావరాలపై జరిగిన దాడులను ఖండించారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం ప్రయత్నించాలని సూచించారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా ఇరాన్ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్ చేయడం ఇది రెండోసారి. ఇరాన్ ప్రెసిడెంట్‌కు ఫోన్ చేసిన మాట్లాడిన విషయాన్ని మోదీ ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.‘‘తో మాట్లాడి, ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ పండుగ పశ్చిమాసియాకు శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును తీసుకొస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేశాం.. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగించి, ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించే ఈ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ఖండించాం.. నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించి, జల మార్గాలు తెరిచి, సురక్షితంగా ఉండేలా చూసే ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాం.. ఇరాన్‌లోని భారత పౌరుల భద్రత, రక్షణకు నిరంతరం ఇరాన్ అందిస్తున్న మద్దతును ప్రశంసించాం’’ అని పోస్ట్ పెట్టారు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన రెండు రోజుల్లోనే ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడి గురించి మోదీకి ముందే తెలుసా? అనే ప్రచారంపై ఇజ్రాయెల్ స్పష్టత ఇచ్చింది. ఫిబ్రవరి 28న ఉదయం ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, 26న భారత ప్రధాని పర్యటన ముగించుకుని వెళ్లిపోయారని తెలిపింది.